బ్యాంకు ఉద్యోగులు మరోసారి
సమ్మెకు దిగనున్నారు. సెప్టెంబరు
2వ తేదీన ఐదు లక్షల మంది బ్యాంకర్లు
ఒకరోజు సమ్మె చేస్తున్నట్లు
ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్
అసోసియేషన్(ఏఐబీఈఏ) గురువారం
వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం
ప్రవేశపెట్టిన నూతన ఆర్థిక
విధానాలు, కార్మిక వ్యతిరేక
సంస్కరణలను వ్యతిరేకిస్తూ
ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు.
నేషనల్ ట్రేడ్ యూనియన్ కన్వెన్షన్‌లో
సమ్మెపై నిర్ణయం తీసుకున్నట్లు
ఏఐబీఈఏ తెలిపింది.
క్లీనింగ్ బ్యాలెన్స్ షీట్స్ పేరుతో పెద్ద మొత్తంలో బ్యాడ్ లోన్స్‌ని ప్రజల దృష్టిలోకి రాకుండా చేస్తున్నారని, ఏటా సగటున 50వేల కోట్ల రుణాలను రైట్ ఆఫ్ చేస్తున్నారని జనరల్ సెక్రెటరీ సీహెచ్ వెంకటాచలం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రైవేటు రంగ బ్యాంకులు, విదేశీ, ప్రాంతీయ, గ్రామీణ, కోఆపరేటివ్ బ్యాంకుల ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొననున్నట్లు ఏఐబీఈఏ జనరల్ సెక్రటరీ వెంకటాచలం తెలిపారు.

No comments:
Post a Comment