Monday, 1 August 2016

నవలా రచయిత్రి కె.రామలక్ష్మికి ‘మాలతీచందూర్‌ పురస్కారం’


ప్రముఖ రచయిత్రి, కాలమిస్ట్‌ మాలతీ చందూర్‌ పేరిట ఏర్పాటుచేసిన స్మారక పురస్కారాన్ని ఈ ఏడాది ప్రముఖ నవలా రచయిత్రి కె.రామలక్ష్మికి ప్రదానం చేయనున్నట్లు సోమవారం చెన్నైలో ప్రకటించారు. అమరజీవి పొట్టిశ్రీరాములు మెమోరియల్‌ సొసైటీ, చందూర్‌ కుటుంబ సభ్యులు, స్నేహితులు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ పురస్కార ప్రదానోత్సవం హైదరాబాద్‌లోని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఉన్న డాక్టర్‌ నందమూరి తారకరామారావు కళామండపంలో ఈ నెల 21వ తేదీ ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు జరుగనుంది. తమిళనాడు గవర్నర్‌ డాక్టర్‌ కొణిజేటి రోశయ్య ముఖ్య అతిథిగా హాజరై పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌, కేంద్రీయ హిందీ సమితి సభ్యులు డాక్టర్‌ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, కాకతీయ విశ్వవిద్యాలయం విశ్రాంతాచార్యులు కాత్యాయనీ విద్మహే, సీనియర్‌ రచయిత, నటుడు రావికొండలరావు గౌరవ అతిథులుగా పాల్గొంటారని పొట్టిశ్రీరాములు సొసైటీ అధ్యక్షులు నారాయణగుప్తా విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సమావేశంలో సొసైటీ ప్రధాన కార్యదర్శి వై.రామకృష్ణతోపాటు యార్లగడ్డ లక్ష్మీనారాయణ కూడా పాల్గొన్నారు.

No comments:

Post a Comment