19 ఏళ్ల యువతికి
ఆవహించిన క్షుద్రశక్తులను వదిలిస్తానని చెప్పి 65 ఏళ్ల ఓ మంత్రగాడు
పలుమార్లు అత్యాచారం జరిపిన ఘటన గుర్గావ్ లో జరిగింది. గుర్గావ్
కు చెందిన 19 ఏళ్ల బాలికకు క్షుద్రశక్తులు ఆవహించాయని, భూతవైద్యం చేసి
వాటిని దూరం చేయాలని కోరుతూ తల్లిదండ్రులే గుర్గావ్ జిల్లాలోని సోహ్నా
ప్రాంతంలోని దీన్ ముహమ్మద్ అలియాస్ దీను అనే 65 ఏళ్ల మంత్రగాడి వద్దకు
తీసుకువెళ్లారు. తనకున్న శక్తులతో యువతికి పట్టిన దయ్యాన్ని
వదిలిస్తున్నానని కుటుంబసభ్యులను నమ్మిస్తూ, యువతిపై గత కొన్నాళ్లుగా
అత్యాచారం జరిపాడు. యువతికి దయ్యం వదిలివెళుతుందని చెపుతూ...యువతిని
తీసుకువచ్చిన ప్రతిసారి ఆమెను రేప్ చేయడమే కాకుండా ఐదువేల రూపాయల చొప్పున
తనకు ఫీజు ఇవ్వాలని మంత్రగాడు డిమాండు చేశాడు. అసలు విషయాన్ని గ్రహించిన
యువతి కుటుంబసభ్యులు మంత్రగాడి దుర్మార్గంపై గుర్గావ్ పోలీసులకు ఫిర్యాదు
చేశారు. హర్యానా పోలీసులు రంగప్రవేశం చేసి మంత్రగాడు దీన్ ముహమ్మద్ ను
అరెస్టు చేసి, ఆయనపై మోసం, అత్యాచారంలపై ఐపీసీ సెక్షన్ 354, 376, 420ల కింద
కేసు నమోదు చేశారు. మంత్రగాడికి సహకరించిన దారాబ్ ఖాన్ ను కూడా పోలీసులు
అరెస్టు చేశారు. మంత్రగాడైన దీన్ ముహమ్మద్ కు ముగ్గురు భార్యలు, పదిమంది
పిల్లలున్నారని పోలీసుల విచారణలో తేలింది. నిందితుడు ముహమ్మద్ 2002లో
పంచాయతీ సమితి అధ్యక్షుడిగా కూడా పనిచేశాడని పోలీసులు చెప్పారు.

No comments:
Post a Comment