హీరో కావాలని సినిమా
రంగంలోకి వచ్చిన రామానాయుడు నిర్మాతగా స్థిరపడ్డాడు. రామానాయుడి కలను తన
చిన్న కొడుకు విక్టరీ వెంకటేష్ నిజం చేశారు. వెంకటేష్ హీరోగా
నిలదొక్కుకోవడానికి నాంది పలికిన చిత్రం ‘కలియుగ పాండవులు’ ఈ చిత్రం
విడుదలై ఆగస్టు 14కు సరిగ్గా 30 సంవత్పారాలు. వెంకటేష్ పేరుకు ముందు
విక్టరీ చేర్చిన చిత్రం కూడా కలియుగ పాండవులే కావడం విశేషం. 1986 ఆగస్టు
14న రిలీజైన ఈ సినిమాకు సురేష్ ప్రొడక్షన్స్ల్‌లో ప్రముఖ దర్శకులు
రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. అప్పట్లో ఈ సినిమా విజయభేరి మోగించింది.
కలియుగ పాండవులు 30 ఏళ్ల సందర్భంగా వెంకీ అలనాటి స్మృతులను
గుర్తుచేసుకున్నారు. మొదటిసారిగా ఖుష్భు ఈ సినిమాతో చిత్ర రంగంలోకి
వచ్చిందన్నారు. ఈ సినిమాలోని నటులంతా తమ ప్రతిభను నిరూపించుకున్నారని వెంకీ
చెప్పారు. కలియుగపాండవుల్లో రావు గోపాలరావు తన తండ్రిగా నటించారని, ఆయనతో
నటించడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.

No comments:
Post a Comment