Saturday, 6 August 2016

సినిమాలకు సమంత గుడ్‌బై... జనతాగ్యారేజే చివరి చిత్రమా ?


‘ఏ మాయ చేశావే’తో తెలుగు తెరపై అరంగేట్రం చేసి ప్రేక్షకులను నిజంగానే తన మాయలో పడేసింది సమంత. అప్పట్నుంచి, ఇప్పటివరకు అంటే దాదాపు ఆరేళ్లపాటు స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ అనుభవించింది. ఈ ఆరేళ్లలోనే తెలుగు, తమిళ భాషల్లో మొత్తం 26 సినిమాల్లో నటించింది. అయితే తాజాగా అక్కినేని వారబ్బాయి నాగచైతన్యతో ప్రేమలో పడడంతోపాటు పెళ్లి కూడా చేసుకోనుందనే వార్తలు పుట్టుకొచ్చాయి. ఈ వార్తలను అక్కినేని కుటుంబ సభ్యులు ధ్రువీకరించికపోయినా, సమంత మాత్రం చెప్పీ చెప్పకుండా చెబుతూనే ఉంది.
పెళ్లి కోసమే సినిమాలు కూడా తగ్గించుకుంటోందనే వార్తలు కూడా వినబడుతున్నాయి. ధనుష్‌తో సినిమా నుంచి తప్పుకున్న సమంత, తాజాగా నాగచైతన్య అప్‌కమింగ్‌ ఫిల్మ్‌ నుంచి కూడా బయటకొచ్చేసింది. ఈ నేపథ్యంలో జూనియర్‌ ఎన్టీయార్‌తో ప్రస్తుతం చేస్తున్న ‘జనతా గ్యారేజ్‌’ సినిమానే సమంతకు చివరి సినిమా కానుందనే వార్తలు వినబడుతున్నాయి. కేరళలో ప్రస్తుతం జరుగుతున్న పాట షూటింగ్‌తో ఈ సినిమాలో సమంత పార్ట్‌ కంప్లీట్‌ అవుతుందట. కాబట్టి సమంత చివరి షూటింగ్‌ ఇదే అవుతుందంటూ సినీ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.

No comments:

Post a Comment