Monday, 1 August 2016

కూల్‌డ్రింక్‌లో మద్యం కలిపి ఇచ్చి మూడురోజులుగా గ్యాంగ్‌రేప్ !


వివాహితపై సామూహిక అత్యాచారం
శీతల పానీయంలో మద్యం కలిపి తాగించిన వైనం

  ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలంలోని వెల్లలచెరువు గ్రామానికి చెందిన ఓ వివాహిత మహిళపై నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు, బాధితురాలు, బంధువుల కథనం ప్రకారం వెల్లల చెరువు ఎస్సీ కాలనీకి చెందిన మహిళకు అదే గ్రామానికి చెందిన వ్యక్తికి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. మహిళకు అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో సాన్నిహిత్యం ఉంది. ఈ నేపధ్యంలో మూడు రోజులుగా నలుగురు వ్యక్తులు ఆమెకు శీతల పానీయంలో మద్యం కలిపి ఊరు బయటికి తీసుకెళ్లి సామూహికంగా అత్యాచారం చేశారు. అనారోగ్యం పాలైన బాధితురాలిని బంధువులు శనివారం నర్సరావుపేట వైద్యశాలకు తీసుకెళ్లారు. కోలుకున్న తర్వాత సంఘటన వివరాలను బాధితురాలు బంధువులకు తెలిపింది. బాధితురాలు ఆదివారం రాత్రి కుటుంబసభ్యులతో వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

No comments:

Post a Comment