ఇంటర్నెట్ పాపులర్ సెర్చ్
ఇంజన్ టొరెంట్ శుక్రవారం నుంచి ఓపెన్ కావడం లేదు. టొరెంట్‌ను బ్యాన్
చేయించినట్లు తెలుస్తోంది. పైరసీకి సంబంధించిన కంటెంట్‌ను ఎక్కువగా పంపిణీ
చేస్తుందనే ఉద్దేశంతోనే ఈ సైట్‌ను బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సైట్
వీక్షకులు కొన్ని కోట్ల మందే ఉన్నారు. దీనికి కారణం తక్కువ డేటా ఛార్జ్‌తో,
త్వరగా ఓపెన్ కావడమేనని చెబుతున్నారు. దాదాపు 13 సంవత్సరాలుగా టొరెంట్జ్ ఈ
సేవలను అందిస్తోంది. టొరెంట్ సైట్స్‌ను బ్లాక్ చేయడం ఇవాళ కొత్తేమి కాదు.
చాలాసార్లు సైట్ బ్లాకయింది. అయితే మరో కొసమెరుపేంటంటే కొద్దిసేపటి క్రితమే
టొరంట్ యాజమాన్యం సైట్‌ను మూసేస్తున్నట్లు ప్రకటించింది.

No comments:
Post a Comment