Tuesday, 9 August 2016

మగబిడ్డ కోసం 5మంది ఆడపిల్లలను కన్నారు... కానీ పాపం...


  • తల్లిదండ్రులు మృతి..అనాథలైన ఆడపిల్లలు
  • కొడుకు కావాలని 5మంది ఆడపిల్లలను కన్నారు
  • పోషణభారమై తనువుచాలించారు
  • కులవృత్తి కూడుపెట్టలేదు
  • సమాజం ఆదుకోలేదు
రైల్వేకోడూరు రూరల్‌ : అమ్మనాన్నల మృతితో 5మంది ఆడపిల్లలు అనాథలైన ఘటన కడప జిల్లా రైల్వేకోడూరు మండలం చియ్యవరం గ్రామపంచాయతీ పరిధిలో నడంపల్లె గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళితే నడంపల్లె గ్రామానికి చెందిన మడితపు శివయ్య బుజ్జమ్మ దంపతులు రజక కులవృత్తి చేసుకుంటూ జీవించేవారు. కొడుకు కావాలని కాంక్షతో 5 మంది ఆడపిల్లలకు జన్మనిచ్చారు. కొంతకాలం తర్వాత తండ్రి శివయ్యకు ఆనారోగ్యం చేసింది. దీంతో 5 మంది ఆడపిల్లలను, భార్యను ఎలా పోషించుకోవాలనే దిగులుతో గతేడాది పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త చనిపోయినప్పటి నుంచి బుజ్జమ్మ కూలిపనులు, కులవృత్తి చేసుకుని 5మంది ఆడపిల్లను పోషించుకునేది. ఇటీవల కూలిపనులు కూడా లేక పిల్లల పోషణకు సరిపోక అవస్థలు పడుతూ మానసిక వత్తిడికి గురై రెండురోజుల క్రితం విషద్రావణం తాగడంతో ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. దీంతో శివయ్య, బుజ్జమ్మల పిల్లలు శిరీషా 12, ప్రసన్న 10, మల్లిక 8, నందిని 6, విజిత 4 సంవత్సరా వయస్సు కలిగిన పిల్లలు అనాథలయ్యారు. అనాథలైన ఆడపిల్లలకు వృద్ధ్దుడైన చెవిటితనం కలిగిన తాత వెంకటసుబ్బయ్య ఉన్నాడు. కొడుకుకావాలి కొడుకుకావాలని 5మంది ఆడపిల్లలను కని చివరకు వారిని పోషించలేక తనువులు చాలించారా తల్లితండ్రులు. దీంతో నడింపల్లె గ్రామంలో అనాథలైన పిల్లలను చూసి విలపించేవారేగాని ఆదుకుని అక్కున చేర్చుకునేవారులేరు. ప్రభుత్వంగాని స్వచ్చంద సంస్థలుగాని మనుసున్నమహారాజులు గాని వారిని ఆదుకోవాలని స్థానికులతోపాటు తాత వెంకటసుబ్బయ్య వేడుకుంటున్నారు.
పిల్లల పోషణకు చేయూత నివ్వండి
ఏడాది కాలంలో కొడుకు, కోడలు మృత్యువాత పడ్డారు, వృద్ధ్దుడైన నేను 5 మంది ఆడపిల్లలను ఎలా సాకాలి. దాతలు ముందుకు వచ్చి చేయూతను అందించాలి. పిల్లల సంరక్షణకు, ఇల్లు నిర్మించుకునేందుకు ఆర్థ్థిక సహాయంచేసి ఆదుకోవాలి.
వెంకటసుబ్బయ్య, ఆడపిల్లల తాత

No comments:

Post a Comment