క్యూబా:
స్విమ్మింగ్ కోసం కుమార్తెను తీసుకెళ్లిన ఓ తండ్రి చేసిన పనికి ఆమె
భయభ్రాంతురాలైంది. చివరికి అక్కడి నుంచి బతుకు జీవుడుగా అని బయటపడింది.
కుమార్తెను స్విమ్మింగ్‌కు తీసుకెళ్లిన ఆ తండ్రి పేరు స్టీఫెన్
ఫ్రింక్(67). వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్. ఆమె పేరు అలెగ్జా ఫ్రింక్(23).
జరిగింది క్యూబాలో. ఇంతకీ ఆ తండ్రి ఏం చేశాడో తెలుసా..? స్విమ్మింగ్
చేయమంటూ జార్డినెస్ డి లా రీనాలోకి దింపాడు. అయితే ఆమెకు తెలియదు. అందులో
పెద్దపెద్ద మొసళ్లు ఉన్నాయని, అవన్నీ నోరు తెరిచి ఆహారం కోసం
ఎదురుచూస్తుంటాయని ఆమెకు తెలియదు. ఆమె ఈత కోసం దిగగానే ఆ పక్క నుంచే
వెళ్లిన ఓ మొసలిని చూసి ఆమె ప్రాణాలు పైనే పోయాయి. అయితే ఆ పక్కనే ఆ తన
ఫొటోలు తీస్తున్న తండ్రిని చూడడంతో కావాలనే తండ్రి అలా చేశాడని
నిర్ణయించుకుని మరుక్షణం ఒడ్డుకు చేరింది. అయితే తండ్రి గురించి తెలిసిన
ఆమె తన కోపాన్ని అక్కడితో వదిలేసింది. అయితే తనకు ప్రమాదం తలపెట్టే పని
తండ్రి ఎన్నటికీ చేయడని, తాను ప్రమాదంలో పడితే చూస్తూ ఊరుకోడని చెబుతోంది
అలెగ్జా. మొసలి పక్కన తానున్న ఫొటోలు చాలా బాగా వచ్చాయంటూ తర్వాత తండ్రిని
మెచ్చుకుందీ తనయ.

No comments:
Post a Comment