Sunday, 7 August 2016

మెగాస్టార్ అమ్మానాన్న.. ఎవరో తెలిస్తే షాకవుతారు!

మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న తన 150వ చిత్రంకోసం తీవ్ర కసరత్తులే చేస్తున్నాడు. ఈ చిత్రానికి కథ, హీరోయిన్, విలన్ నుంచి ఇతర ప్రధాన పాత్రల ఎంపిక వరకూ తీవ్రం గందరగోళం నెలకొంది. ఎట్టకేలకు కథ, హీరోయిన్, విలన్‌ ఎంపిక పూర్తి చేసి షూటింగ్‌ను శరవేగంగా నిర్వహిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి రెండు పాత్రలు పోషిస్తున్నట్లు తెలుస్తోంది. వాటిల్లో యువకుడి పాత్ర ఒకటి. ఈ పాత్రకు తల్లిదండ్రుల ఎంపిక కోసం చిత్రం బృందం నానా తంటాలు పడి చివరకు అలనాటి ‘అమ్మ’ అన్నపూర్ణను మెగాస్టార్‌కు అమ్మగా, చలపతిరావును తండ్రిగా తీసుకున్నట్లు సమాచారం. దీనిపై కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నప్పటికీ చివరికి ఈ ఇద్దరినే ఖరారు చేసినట్లు చెప్పుకుంటున్నారు. అంతేకాదు, వచ్చే వారం నుంచి చలపతిరావు, అన్నపూర్ణల మధ్య కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారనే వార్తలు కూడా టాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ప్రస్తుత సినిమాల్లో అమ్మ పాత్రలకు గ్లామర్‌గా ఉండే నటులనే ఎంచుకుంటున్న పరిస్థితుల్లో అన్నపూర్ణను ఈ పాత్రకు ఎంచుకోవడం సాహసమే. ఒకనాడు టాలీవుడ్‌ సినిమాల్లో ‘అమ్మ’గా అందరి నోళ్లలో నలిగిన అన్నపూర్ణకు ఇటీవలి కాలంలో అవకాశాలు తగ్గిపోయాయి. ‘కత్తిలాంటోడు’ వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో అన్నపూర్ణ జాయిన్ అవ్వడం టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి.

No comments:

Post a Comment