Friday, 24 June 2016

91 ఏళ్ల భారతీయుడి కోరికను పాక్ మన్నించింది

మీరట్ : పొరుగు దేశాలైన భారత్, పాకిస్థాన్‌ మధ్య రాజకీయ సంబంధాలు అంత సజావుగా లేకున్నా తాజాగా ఒక భారతతీయుడి చిరకాల కోరిక పట్ల పాకిస్థాన్ సానుకూలంగా స్పందించింది. 91 ఏళ్ల క్రిష్ణ ఖన్నా పాకిస్థాన్‌లోని తన పూర్వీకుల ఇంటిని సందర్శించాలని పదేళ్లుగా తపిస్తున్నాడు. అతను చేసిన విజ్ఞప్తికి ఎట్టకేలకు పాక్ స్పందించింది. ఆయనను పాక్‌లోని ఉథోక్, షేక్‌పురలో పర్యటించేందుకు అనుమతించింది. ఆయనకు తోడుగా మరో ముగ్గురు వచ్చేందుకు కూడా అంగీకరించింది. 1930 నాటికి ఐదేళ్ల ప్రాయంలో ఉన్న క్రిష్ణా కన్నా ఆనాటి జ్ఞాపకాలను ఇప్పటికీ పదిలంగా ఉంచుకున్నారు. పాకిస్థాన్‌లోని ఉథోక్‌లో తన తాతగారింట్లో ఆడిపాడిన సంఘటనలు ఆయన స్మృతిపథంలో మిగిలిపోయారు. 1947లో విభజనకు ముందు జరిగిన అల్లర్లలో ఆయన కుటుంబం ఉథోక్ నుంచి సురక్షితంగా ఉంటున్నందుకున్న షేక్‌పురకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయింది. అప్పటి అల్లర్లో తన కుటుంబసభ్యులు ఒక దర్గాలో తలదాచుకోవడం, నాటి నరమేథంలో పైశాచిక మూకల నుంచి ఆర్మీ తమను కాపాడిన వైనం ఆయనకు ఇప్పటికీ గుర్తుంది. 'రెండూ బాధిత దేశాలే. మరోసారి పాకిస్థాన్‌లోని మా పూర్వీకుల నివాసాన్ని చూడాలనుకుంటున్నాను. ఇది నా చివరి కోరిక' అని ఖన్నా పేర్కొన్నారు. పదేళ్లుగా ఆయన వీసా కోసం పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తున్నారు. ఎట్టకేలకు పాక్ నుంచి ఆయనకు శుభవార్త అందింది. దీంతో ఖన్నా సంతోషానికి అవధుల్లేవు. 80 ఏళ్ల వయస్సులో ఉన్న తన సోదరుడు జగదీష్‌తో కలిసి త్వరలోనే ఆయన పాక్‌లో తన పూర్వీకుల ఇంటిని సందర్శించనున్నారు. 'సానుకూలంగా ఉండాలన్నదే మా అభిమతం. సీనీయర్ సిటిజన్ (ఖన్నా) చేసుకున్న విన్నపాన్ని మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. వీసా మంజూరు చేస్తున్నాం' అని పాక్ హైకమిషన్ ప్రెస్ మినిస్టర్ మన్జూర్ అలి మెమన్ తెలిపారు.

భారీ పతనాల్లో ఇదీ ఒకటి!

భారతీయ స్టాక్‌మార్కెట్లకు ‘బ్రెగ్జిట్‌’ శరాఘాతంలా తగిలింది. వంద కాదు, రెండు వందలు కాదు ఏకంగా వెయ్యి పాయింట్లకు పైగా సెన్సెక్స్‌ కోల్పోయింది. దీంతో మదుపర్లు తీవ్రంగా నష్టపోయారు. దేశీయ స్టాక్‌మార్కెట్లు చవిచూసిన భారీ పతనాల్లో ఇది కూడా ఒకటి.
గత శుక్రవారం ఆర్‌బీఐ గవర్నర్‌ రఘురాం రాజన్‌ నిర్ణయంతో ఈ వారం ట్రేడింగ్‌ ఆరంభంలో స్టాక్‌మార్కెట్లు భారీగా పతనమవుతాయని అందరూ భావించారు. అంతేకాకుండా ఆ సమయంలో ‘బ్రెగ్జిట్‌’ కూడా మార్కెట్‌ను భయపెట్టింది. అయితే కీలక రంగాల్లో ప్రభుత్వం ఎఫ్‌డీఐలకు ఆమోదం తెలపడంతో మార్కెట్లు లాభాల బాటలో పయనించాయి. ఒక ఆపద గట్టెక్కిందని అందరూ వూపిరి పీల్చుకున్నారు. అయినా ‘బ్రెగ్జిట్‌’కు సమయం దగ్గరపడే కొద్దీ భయాలు మరింత పెరిగాయి. యూకే పౌరులు ‘బ్రెగ్జిట్‌’కే మద్దతు తెలపడంతో అనుకున్నదంతా జరిగింది.
ఇంట్రాడే పరంగా, ముగింపు విషయంలోనూ సోమవారంనాడు మార్కెట్లు ఎక్కువగా నష్టపోయినట్లు చరిత్ర చెబుతోంది. ముగింపు పరంగా చూస్తే ఒక రోజులో సెన్సెక్స్‌కు వచ్చిన 10 భారీ పతనాల్లో సోమవారం ఏడు, గురువారం రెండు, మంగళవారం ఒకటి ఉన్నాయి. ఇప్పుడు వీటికి శుక్రవారం వచ్చి తోడైంది.
స్టాక్‌ మార్కెట్‌ భారీ పతనాల్లో కొన్ని..
 

256 ఏళ్లు బతికాడట

ప్రస్తుతం 80ఏళ్లు బతికితే మహాభాగ్యం అనుకుంటున్నాం మనం. ఎవరైనా వందేళ్లు బతికితే.. అదేదో వింతలా వార్తల్లో నిలుస్తున్నారు. మరి ఒకప్పుడు ప్రతి ఒక్కరూ నూరేళ్లకుపైనే బతికేవాళ్లు. అయితే అప్పుడు కూడా ఓ వింత జరిగింది. ఓ వ్యక్తి ఏకంగా 256 ఏళ్లు బతికాడట! అది ఇప్పటికీ ఆశ్చర్యకరమైన విషయమే.
చైనాకు చెందిన లీ చింగ్‌ యన్‌ 1933 మే 6న మరణించాడు. ఆయన మరణించినప్పటికి అతని వయస్సు 256 ఏళ్లట. అన్నేళ్లు బతకడం చరిత్రలోనే తొలిసారి జరిగిన సంఘటన. సిచుయాన్‌ ప్రాంతంలో జన్మించిన లీ చింగ్‌ పదేళ్ల వయస్సులో ఆయుర్వేద మూలికలు సేకరిస్తూ.. అనేక ప్రాంతాల్లో తిరిగాడు. ఆయుర్వేద వైద్యుడిగా అనేక చోట్ల కాలం వెళ్లదీసి 72ఏళ్ల వయస్సులో కై క్సియన్‌ ప్రాంతానికి చేరుకున్నాడు. 1749లో ఆర్మీలో చేరి మార్షల్‌ ఆర్ట్స్‌ శిక్షకుడిగా.. సలహాదారుగా విధులు నిర్వర్తించాడు. ఆ తర్వాత 1927లో లీ చింగ్‌ను తిరిగి ఆయన స్వస్థలానికి పిలిపించారు.

అప్పటికీ ఆయనకు 24మంది భార్యలు.. 500పైగా పిల్లలు ఉన్నారు. ఆయన కుటుంబంలో 11 తరాలను చూశాడు. చివరికి 1933లో మరణించాడట. అయితే ఆయన వయస్సుపై భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. లీ చింగ్‌ తాను 1736లో జన్మించాడని స్వయంగా చెప్పాడట. అయితే చెంగుడు యూనివర్సిటీకి చెందిన ఓ ప్రొఫెసర్‌ మాత్రం లీ చింగ్‌ 1677లో జన్మించాడని అంటున్నారు. 1930లో ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ ప్రచురించిన కథనం ప్రకారం చైనా ప్రభుత్వం రికార్డుల్లో 1827లో లీ చింగ్‌కు 150వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారని.. 1877లో 200వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపినట్లు ఆధారాలు ఉన్నట్లు చెబుతున్నాడు.
రెండు కథనాల ప్రకారం లీ చింగ్‌ 197ఏళ్లు లేదా 256ఏళ్లు జీవించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా వందల ఏళ్లు జీవించడం అనేది ఒక అద్భుతమైన సంఘటన అనే చెప్పాలి.
ఇప్పటి వరకు ఫ్రెంచ్‌కి చెందిన ఓ మహిళ 122 ఏళ్లు జీవించి అత్యధిక వయస్సున్న మనిషిగా రికార్డు సాధించింది. ఆమె కంటే ఆ చైనీయుడు రెండింతలకు పైగానే బతికాడన్నమాట.

10జిబి 4జి డేటా 93రూపాయలకే !


100రూపాయలకు 4జి డేటా ఎంత వస్తుంది. ఎంత తక్కువ ధరకు అందించే నెట్‌వర్క్ అయినా 1జిబి కూడా రాదు. అలాంటిది 93 రూపాయలకే 10జిబి 4జీ డేటాను అందిస్తామంటోంది రిలయన్స్. రిలయన్స్ జియోస్ నెట్‌వర్క్ పొందిన వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తోంది. మిగిలిన నెట్‌వర్క్ ఆపరేటర్లు అందించే రేటు కంటే ఇది 94 శాతం తక్కువ. 12 సర్కిల్స్‌లో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. వచ్చే వారం నుంచి ఈ ఆఫర్ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు టెలికామ్ శాఖకు ఆర్‌కామ్ ఓ లేఖ రాసింది. వచ్చేవారం నుంచి రిలయన్స్ జియో ఇన్‌ఫోకమ్ 4జీ నెట్‌వర్క్ తీసుకున్న వారికి 10జీబీ ఉచిత 4జీ సేవలు అందించనున్నట్లు లేఖలో పేర్కొంది.
 
అయితే సీడీఎమ్‌ఏ కస్టమర్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. దీని ప్రకారం ఆర్‌కామ్ సీడీఎమ్‌ఏ కస్టమర్లు 4జీ కి అప్‌డేట్ చేసుకుంటే చాలు. అయితే ఈ డేటా ప్యాక్‌కు సంబంధించిన ధరలు ఒక్కో సర్కిల్‌లో ఒక్కో విధంగా ఉండొచ్చని సంస్థ తెలిపింది. ఏ సర్కిల్‌లోనైనా 93 రూపాయల నుంచి 97 రూపాయల మధ్యలోనే ఉంటుందని రిలయన్స్ తెలిపింది. మరిన్ని వివరాలకు ఆర్‌కామ్ వెబ్‌సైట్‌ను వీక్షించాలని సంస్థ పేర్కొంది.

‘బ్రెగ్జిట్‌’తో బంగారం పరుగులు..

బ్రెగ్జిట్‌ ప్రభావం బంగారం, వెండి ధరలపై పడింది. పసిడి నేడు రెండేళ్ల గరిష్ఠానికి పెరిగింది. 26 నెలల్లో అత్యధికంగా ఈరోజు పది గ్రాముల బంగారం ధర రూ.30,885కు చేరింది. 2013 ఆగస్టు తర్వాత ఒక్క రోజులో బంగారం ధర ఇంతగా పెరిగింది ఈరోజే. అలాగే 2014 ఏప్రిల్‌ 28న పది గ్రాముల బంగారం ధర రూ.30,730కు చేరిన తర్వాత మళ్లీ ఈరోజు అధికంగా రూ.30,885కు చేరింది. ప్రజాభిప్రాయ సేకరణలో బ్రిటన్‌ యూరోపియన్‌ యూనియన్‌ నుంచి వైదొలిగేందుకు మొగ్గుచూపిన సంగతి తెలిసిందే.
వెండి ధర కూడా కేజీకి రూ.1000 పెరిగి రూ.42,300 అయ్యింది. బ్రెగ్జిట్‌ ప్రభావంతో రూపాయి విలువ కూడా పడిపోయింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.68.21 పైసలకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ బంగారం ధరలు పెరిగాయి. లండన్‌లో 8.1 శాతం పెరిగి ఔన్సు బంగారం ధర 1,354.54 డాలర్లకు చేరింది.

Tuesday, 21 June 2016

ATM లో డ‌బ్బులు డ్రా చేసిన‌ప్పుడు న‌కిలీ నోట్లు వ‌స్తే ఏం చేయాలో తెలుసుకోండి..!



             ఒక‌ప్పుడంటే బ్యాంక్‌లో ఉన్న డ‌బ్బులు డ్రా చేయాలంటే బ్యాంక్‌కు వెళ్లి, ఫాం నింపి క్యాషియ‌ర్‌కి ఇస్తే కొంత సేపు వెయిట్ చేసిన త‌రువాత లైన్‌లో నిల‌బ‌డి డ‌బ్బులు తీసుకోవాల్సి వ‌చ్చేది. కానీ ఇప్పుడు అలా కాదు. అధునాతన సాంకేతిక ప‌రిజ్ఞానంతో కూడిన ఏటీఎంలు వ‌చ్చేశాయి. అవి ఎక్క‌డ ప‌డితే అక్క‌డ మ‌న‌కు అందుబాటులో ఉంటున్నాయి. అయితే వాటిలో డ‌బ్బులు డ్రా చేసేందుకు య‌త్నించిన‌ప్పుడు డ‌బ్బులు అకౌంట్ నుంచి క‌ట్ అయి కూడా మెషీన్ నుంచి బ‌య‌ట‌కు రాక‌పోతే చిన్న కంప్లెయింట్ ఇచ్చి మ‌న డ‌బ్బును మ‌నం తిరిగి పొందేందుకు వీలుంది. దీంతో ఎలాంటి స‌మ‌స్యా లేదు. కానీ ఈ మ‌ధ్య ఏటీఎంల‌లో న‌కిలీ నోట్లు వ‌స్తున్నాయి. వాటిని తీసుకున్న వినియోగ‌దారులు బ్యాంకుకు వెళ్తే బ్యాంక్ వారు త‌మ‌కేం తెలియ‌ద‌ని స‌మాధానం చెప్ప‌డం, దీంతో బాధితులు గ‌గ్గోలు పెట్ట‌డం ఇప్పుడు స‌ర్వ సాధార‌ణం అయింది. అయితే మీకు తెలుసా? ఏటీఎంల‌లో న‌కిలీ నోట్లు వ‌చ్చినా వాటిని తిరిగి ఇచ్చి బ్యాంకుల ద్వారా అస‌లైన నోట్లు పొంద‌వ‌చ్చ‌ని. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఇలాంటి స‌మ‌స్య ఎదుర‌య్యే వారు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.

ఏటీఎంలో న‌కిలీ నోట్లు రాగానే కంగారు ప‌డ‌కూడ‌దు. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మై అక్క‌డ ఉండే సెక్యూరిటీ గార్డుకు ఈ విష‌యాన్ని తెలియ‌జేయాలి. ఇటీవ‌లి కాలంలో దాదాపు అధిక శాతం ఏటీఎంల వ‌ద్ద సెక్యూరిటీ గార్డులు ఉంటున్నారు. కాబ‌ట్టి న‌కిలీ నోట్లు రాగానే ఆ గార్డుకు విష‌యం చెప్పి అత‌ని వ‌ద్ద ఉండే రిజిస్ట‌ర్‌లో మీరు డ్రా చేసిన మొత్తం, న‌కిలీ నోట్లు ఎన్ని వ‌చ్చాయి, ఏయే నోట్లు వ‌చ్చాయి, వాటి నంబ‌ర్లు, మీరు లావాదేవీ నిర్వ‌హించిన స‌మ‌యం, తేదీ, ఏటీఎం స్లిప్, దాని ట్రాన్‌సాక్ష‌న్ నంబ‌ర్‌ వంటి వివ‌రాలను అన్నింటిని ఆ రిజిస్ట‌ర్‌లో ఎంట‌ర్ చేసి గార్డు సంత‌కం తీసుకోవాలి. వీలైతే ఇప్పుడు చెప్పిన వివ‌రాల‌కు సంబంధించిన ఫొటోల‌న్నింటినీ స్మార్ట్‌ఫోన్ ద్వారా తీసి భ‌ద్ర ప‌రుచుకోవాలి. అనంతరం పైన చెప్పిన ఆయా వివ‌రాల‌కు సంబంధించిన జిరాక్స్ ప్ర‌తుల‌ను తీసి బ్యాంక్‌కు వెళ్లి అక్క‌డి మేనేజ‌ర్‌కు ఫిర్యాదు చేయాలి. బాధితుడు తాను చేసిన లావాదేవీకి సంబంధించిన పూర్తి వివ‌రాల‌తో కూడిన ఓ లెట‌ర్‌ను రాసి మేనేజ‌ర్‌కు ఇవ్వాలి. దానికి ముందు చెప్పిన జిరాక్స్ ప్ర‌తుల‌ను కూడా ఇవ్వాలి. బ్యాంక్ వారు మీ ద‌గ్గ‌ర ఉన్న న‌కిలీ నోట్ల‌ను తీసుకుని వాటిని త‌మ ద‌గ్గ‌ర ఉండే ప‌రిక‌రాల ద్వారా స్కాన్ చేసి అవి నకిలీ నోట్ల‌నే విష‌యాన్ని ధృవ ప‌రుస్తారు. అనంత‌రం వాటికి బ‌దులుగా మీకు అంతే మొత్తంలో డ‌బ్బును ఇస్తారు.
ఆర్‌బీఐ నిబంధ‌న‌ల ప్ర‌కారం ప్ర‌తి బ్యాంక్ పైన చెప్పిన విధంగా చేయాల్సి ఉంటుంది. ఒక‌వేళ ఏ బ్యాంక్ అయినా స్పందించ‌క‌పోతే స్థానిక పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసే హ‌క్కు బాధితునికి ఉంటుంది. అంతేకాదు త‌దుప‌రి చ‌ర్య‌గా బాధితుడు ఆర్‌బీఐ సైట్‌(www.rbi.org.in)లో ఉన్న మెయిల్ ఐడీకి త‌మ ఫిర్యాదుతో కూడిన లేఖ‌ను మెయిల్ రూపంలో పంపించ‌వ‌చ్చు. లేదంటే స్థానికంగా ఉన్న బ్యాంకింగ్ అంబుడ్స్‌మ‌న్‌కు ఫిర్యాదు చేయ‌వ‌చ్చు. అలా ఇచ్చిన ఫిర్యాదుకు ఆర్‌బీఐ లేదా బ్యాంకింగ్ అంబుడ్స్‌మ‌న్ అధికారులు స్పందించి త‌క్ష‌ణ‌మే చ‌ర్య తీసుకుంటారు. బాధితునికి త‌గిన న్యాయం చేస్తారు. ఇప్పుడు తెలుసుకున్నారుగా, ఏటీఎంల‌లో న‌కిలీ నోట్లు వ‌స్తే ఏం చేయాలో. ఈ స‌మాచారాన్ని మ‌రింత మందికి షేర్ చేయడం మ‌రిచిపోకండి. దీని వ‌ల్ల న‌కిలీ నోట్ల‌ బాధితులు ఎవ‌రైనా ఉంటే వెంట‌నే త‌మ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోగ‌లుగుతారు.

‘ఫిలిం ఫేర్‌’ అవార్డుల విజేతలు వీరే..

దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రతిష్ఠాత్మంగా అందజేసే ఫిలింఫేర్‌ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం శనివారం అట్టహాసంగా జరిగింది. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో నిర్వహించిన ఈ 63వ ఫిలిం ఫేర్‌ పురస్కారాల వేడుకకు దక్షిణాది చిత్ర పరిశ్రమకు సంబంధించిన సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా వివిధ విభాగాల్లో గెలుపొందిన వారికి ఫిలిం ఫేర్‌ అవార్డులను ప్రదానం చేశారు.
తెలుగు నుంచి ఫిలిం ఫేర్‌ అవార్డులు గెలుచుకున్న వారిని పరిశీలిస్తే...
* జీవిత సాఫల్యం: మంచు మోహన్‌బాబు
* ఉత్తమ చిత్రం: బాహుబలి
* ఉత్తమ నటుడు: మహేశ్‌బాబు(శ్రీమంతుడు)
* ఉత్తమ నటి: అనుష్క (రుద్రమదేవి)
* ఉత్తమ నటుడు(తొలి పరిచయం): అఖిల్‌
* ఉత్తమ నటి(తొలిపరియం): ప్రగ్యా జైశ్వాల్‌
* ఉత్తమ సహాయనటుడు: అల్లు అర్జున్‌(రుద్రమదేవి)
* ఉత్తమ సహాయనటి: రమ్యకృష్ణ(బాహుబలి)
* ఉత్తమ దర్శకుడు: ఎస్‌.ఎస్‌. రాజమౌళి(బాహుబలి)
* ఉత్తమ నటి( క్రిటిక్స్‌ జ్యూరీ అవార్డు): నిత్యా మేనన్‌( మళ్లీ మళ్లీ ఇది రాని రోజు)
* ఉత్తమ నటుడు( క్రిటిక్స్‌ జ్యూరీ అవార్డు): నాని (భలే భలే మగాడివోయ్‌)
* ఉత్తమ కొరియోగ్రాఫర్‌: శేఖర్‌ వి.జె (కుగ్‌ఫు కుమారి-బ్రూస్‌లీ)
* ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌: కె.కె. సెంథిల్‌కుమార్‌(బాహుబలి)
* ఉత్తమ నేపథ్య గాయకురాలు: గీతా మాధురి( జీవనది-బాహుబలి)
* ఉత్తమ నేపథ్య గాయకుడు: ఎం.ఎల్‌.ఆర్‌ కార్తికేయన్‌( పోరా శ్రీమంతుడ-శ్రీమంతుడు)
* ఉత్తమ గీత రచయిత: సిరివెన్నెల సీతారామశాస్త్రి( రా ముందడుగేద్దాం-కంచె)
* ఉత్తమ సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌(శ్రీమంతుడు)

భాగవతంలో చెప్పిన ఈ 15 ఇప్పుడు జరుగుతున్నాయి!

11వ శ్లోకానికి సాక్ష్యాలు ఇప్పుడున్న వృద్ధాశ్రమాలు, అనాధాశ్రమాలే! ఇక మిగిలిన వాటికి....
ముంబై : ఇప్పుడు ఏం జరిగినా ‘‘సనాతన ధర్మం ముందే చెప్పింది’’ అనవచ్చునేమో! అష్టాదశ (18) పురాణాల్లో ఒకటైన శ్రీమద్భాగవతం చెప్పిన 15 అంశాలు ఇప్పుడు నిజమవుతున్నాయనిపిస్తోంది. కలియుగం ఎలా ఉంటుందో ఈ పురాణం ఎలా వివరించిందో చూడండి!
 
శ్లోకం : 12.2.1
మతం, నిజాయితీ, పరిశుభ్రత, సహనం, దయ, జీవించే కాలం, శారీరక బలం, జ్ఞాపక శక్తి కలియుగంలో రోజు రోజుకూ క్షీణిస్తాయి. శక్తిమంతమైన కలి ప్రభావమే దీనికి కారణం.
 
శ్లోకం : 12.2.2
వ్యక్తి గుణగణాలను, ప్రవర్తనను అదృష్టాన్ని నిర్ణయించేది అతనికిగల సంపదే. అధికారంలో ఉన్నవారికే న్యాయం దక్కుతుంది.
 
శ్లోకం : 12.2.3
స్త్రీ, పురుషులు పైపై ఆకర్షణల కారణంగానే కలిసి ఉంటారు. వ్యాపార విజయానికి మోసమే ఆధారం అవుతుంది. శృంగార సామర్థ్యం ఆధారంగానే స్త్రీత్వాన్ని, పురుషత్వాన్ని నిర్ణయిస్తారు. కేవలం జంధ్యం మాత్రమే ఓ వ్యక్తి బ్రాహ్మణుడని గుర్తించే సంకేతంగా ఉంటుంది.
 
శ్లోకం : 12.2.4
వ్యక్తి ఆధ్యాత్మిక స్థితిని కేవలం అతని వద్ద పైకి కనిపించే గుర్తుల ఆధారంగానే గుర్తిస్తారు. వాటి ఆధారంగానే ఒక ఆధ్యాత్మిక విధానం నుంచి మరోదానికి మారుతూ ఉంటారు. సరైన సంపాదన లేని వ్యక్తి యోగ్యతపై తీవ్ర ప్రశ్నలు ఎదురవుతాయి. పదాల పడికట్టులో నైపుణ్యం ఉన్నవాళ్ళను పండితుడంటారు.
 
శ్లోకం : 12.2.5
డబ్బు లేని వ్యక్తిని అపవిత్రుడంటారు. కపటం, మాయ ఉన్న వ్యక్తులను సుగుణాల రాశి అంటారు. నోటి మాటలతోనే పెళ్ళిళ్ళు చేసుకుంటారు. కేవలం స్నానం చేసినంత మాత్రానికే బహిరంగంగా కనిపించడానికి అర్హులమైపోయామని జనం భావిస్తూ ఉంటారు.
 
శ్లోకం : 12.2.6
కొద్ది దూరంలో జలాశయం ఉన్న చోటునే పవిత్ర స్థలంగా భావిస్తారు. సౌందర్యం హెయిర్ స్టయిల్‌పై ఆధారపడి ఉంటుందని అనుకుంటారు. కడుపు నింపుకోవటమే జీవిత పరమార్థం అవుతుంది. మొండిగా వ్యవహరించేవారే నిజాయితీపరులుగా ఆమోదం పొందుతారు. కుటుంబాన్ని పోషించగలిగేవాడు గొప్ప నిపుణుడిగా పేరు పొందుతాడు. కీర్తి కోసమే మత సిద్ధాంతాలను పాటిస్తారు.
 
శ్లోకం : 12.2.7
భూగోళం అవినీతి జనంతో క్రిక్కిరిసిపోవడంతో సామాజిక వర్గాల్లో బలవంతుడిగా చలామణి అయ్యేవాడే రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకుంటాడు.
 
శ్లోకం : 12.2.9
ప్రజలు కరవుకాటకాలతో, మితిమీరిన పన్నులతో ఇబ్బందులు పడుతూ ఆకులు, చెట్ల వేళ్ళు, మాంసం, ముడి తేనె, పండ్లు, పువ్వులు, విత్తనాలు తినడాన్ని ఎంచుకుంటారు. అనావృష్టి దెబ్బతో ప్రజలు పూర్తిగా నాశనమవుతారు.
 
శ్లోకం : 12.2.10
చలి, గాలి, వేడి, వర్షం, మంచు వల్ల ప్రజలు తీవ్రమైన బాధలు అనుభవిస్తారు. ఇది చాలదన్నట్లు జగడాలు, ఆకలి, దాహం, వ్యాధులు, తీవ్రమైన ఆందోళనతో జనం చితికిపోతారు.
 
శ్లోకం : 12.2.11
కలియుగంలో మనిషి జీవిత కాలం 50 ఏళ్ళు అవుతుంది.
 
శ్లోకం : 12.3.42
వృద్ధ తల్లిదండ్రులను పిల్లలు ఎంతో కాలం సంరక్షించరు.
 
శ్లోకం : 12.3.41
కలియుగంలో జనం స్వల్ప విషయాలకే ఒకరిపై మరొకరు విద్వేషం పెంచుకుంటారు. చిల్లర నాణేల కోసమే అయినా విద్వేషం పెంచుకుంటారు. స్నేహ సంబంధాలను విడిచిపెట్టేస్తారు. తమ ప్రాణాలను కోల్పోవడానికైనా సిద్ధపడతారు. తమ సొంత బంధువులను హత్య చేయడానికైనా వెనుకాడరు.
 
శ్లోకం : 12.3.38
మొరటు మనుషులు దేవుడి పేరుతో విరాళాలు సేకరిస్తారు. సన్యాసి దుస్తులు ధరించి, నియమ, నిష్ఠలతో వ్యవహరిస్తున్నట్లు డంభాలు చెప్పుకుంటూ తమను తాము పోషించుకుంటారు. మతం గురించి తెలియనివారు ఉన్నత పదవుల్లోకి వెళ్తారు. మత సిద్ధాంతాలపై మాట్లాడేందుకు ప్రయత్నిస్తారు.
 
శ్లోకం : 12.3.36
సంపదను కోల్పోయిన యజమానిని సేవకులు వదిలేస్తారు. ఆ యజమాని సద్గుణాల రాశి అయినప్పటికీ సేవకులు విడిచిపెడతారు. సామర్థ్యం కోల్పోయిన సేవకులను యజమానులు వదిలించుకుంటారు. ఆ సేవకులు వారి కుటుంబాల్లో తరతరాలుగా పని చేస్తున్నప్పటికీ దయ చూపరు. పాలు ఇవ్వని ఆవులను వదిలించుకుంటారు లేదా చంపేస్తారు.
 
శ్లోకం : 12.3.32
నగరాల్లో దొంగలు యథేచ్ఛగా సంచరిస్తారు. నాస్తికులు ఊహాత్మక అర్థాలు చెప్తూ వేదాలను కలుషితం చేస్తారు. రాజకీయ నేతలు ప్రజలను పీడిస్తారు. పూజారులని, మేధావులని పిలిపించుకునేవాళ్ళంతా తమ పొట్టలకు, మర్మాంగాలకు భక్తులుగా మారుతారు.

Sunday, 19 June 2016

‘కబాలి’ పాటలు భళీ భళీ

జనీకాంత్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘కబాలి’ విడుదలకు ముందే సంచలనాలు నమోదు చేస్తోంది. ప్రపంచంలోనే అత్యధిక మంది వీక్షించిన టీజర్‌గా ఇప్పటికే ‘కబాలి’ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకూ ఆ టీజర్‌ను 2.20 కోట్ల మందికి పైగా వీక్షించడం విశేషం. ఈ నెల 11న విడుదలైన ‘కబాలి’ తమిళ గీతాలకూ అదే స్థాయిలో స్పందన వస్తోంది. ఇండియా, మలేసియా, సింగపూర్‌, అమెరికా, బ్రిటన్‌, అరబ్‌ దేశాల్లోని రజనీ అభిమానులు ‘కబాలి’ వీడియో గీతాలను పదే పదే వీక్షిస్తున్నారట. దీంతో విడుదలైన తొలి వారంలోపే యూట్యూబ్‌లో ‘కబాలి’ గీతాల వీక్షకుల సంఖ్య కోటికి చేరింది. ‘నెరుప్పుడా..’ అనే గీతాన్ని విడుదలైన 24 గంటల్లోనే 20 లక్షల మందికి పైగా వీక్షించగా, ఇప్పటికి ఆ సంఖ్య 43 లక్షలు దాటింది. ఇతర ఆన్‌లైన్‌ మాధ్యమాల్లోనూ ‘కబాలి’ గీతాల శ్రోతల సంఖ్య పదిలక్షలకు పైనే ఉంది. ఆడియో గీతాలు విడుదలైన రోజున ఇండియా, సింగపూర్‌, మలేసియా, శ్రీలంకల్లో ఐట్యూన్స్‌ ద్వారా అత్యధికంగా అమ్ముడైన ఆల్బమ్‌గా ‘కబాలి’ సత్తా చాటింది. ఇక ‘కబాలి’ విడుదలయ్యాక ఎన్ని రికార్డులు బద్దలుకొడుతుందో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. పా రంజిత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంతోష్‌ నారాయణ్‌ సంగీతాన్ని అందించారు. వచ్చే నెలలో ‘కబాలి’ విడుదల కానుంది.

కెమెరా.. కరకరా...

అనగనగా ఒక ఫొటోగ్రాఫర్‌. వన్యప్రాణుల ఫొటోలు తీయడం మహా ఇష్టం. కెన్యాలోని మసాయ్‌ మారా జాతీయ పార్కుకు వెళ్లారు. దాదాపు లక్ష రూపాయల విలువైన కెమెరాను ట్రైపాడ్‌కు అమర్చి... తాను దూరంగా నిలబడి... రిమోట్‌ ద్వారా ఆడ సింహాల ఫొటోలు తీస్తున్నాడు. సింహాల దృష్టి కెమెరాపై పడింది. కెమెరా దగ్గరికి వచ్చి ఎగాదిగా చూశాయి. ఒక చిలిపి సింహం... కెమెరాను నోట్లో పెట్టుకుంది. దానిని కరకరా నమిలింది. ‘ఇదేదో మనకు పనికొచ్చే సరుకు కాదు’ అని వదిలేసింది. కెమెరాలో అత్యంత ముఖ్యమైన లెన్స్‌, ముందు భాగం డ్యామేజ్‌! ‘డబ్బా’ మాత్రం మిగిలింది. సింహం ఇలా కెమెరాను ‘నమిలేస్తున్న’ చిత్రాలను థామస్‌ సెలిజ్‌ అనే ఫొటోగ్రాఫర్‌ తీశారు. ‘కెమెరా పోయింది’... అని దాని ఓనర్‌ ఏడుపు! ‘నా ఫొటోలు భలే వచ్చాయ్‌’ అని థామస్‌ సంబరం! ఎవరి బాధ వారిది మరి!

మైసూర్‌ యువరాజు గోల్డెన్‌ శుభలేఖలు...

కర్ణాటకలోని మైసూర్‌ ప్యాలెస్‌లో పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. దాదాపు 40ఏళ్ల తర్వాత మైసూర్‌ ప్యాలెస్‌లో పెళ్లి భాజాలు మోగనున్నాయి. ఈనెల 27న యదువీర్‌ కృష్ణదత్త చమరాజ వడియార్‌, త్రిషికా కుమారిల వివాహం జరగనుంది. ఈ పెళ్లి వేడుకల్లో వివాహ ఆహ్వాన పత్రికలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వీవీఐపీలకు ఇవ్వడం కోసం ప్రత్యేకంగా ఆహ్వాన పత్రికలను రూపొందించారు. ఐదు రకాల పెళ్లి కార్డులను తయారు చేయించారు. రాజమాత ప్రమోదా దేవి ఇటీవల శృంగేరి మఠాన్ని సందర్శించి శ్రీభారతి తీర్థ ఆశీస్సులతో పెళ్లి కార్డుల పంపకాన్ని ప్రారంభించారు.
బంగారు పూత పూసిన అక్షరాలతో వివాహ పత్రికలో పేర్లను ముద్రించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఈ వివాహ వేడుకకు ఆహ్వానించారు. రాజ కుటుంబంలో జరిగే ఈ వేడుకకు కర్ణాటక సీఎం సిద్ద రామయ్య, రాజస్థాన్‌ సీఎం వసుంధర రాజే, దేవగౌడ, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానించినట్లు సమాచారం.

సరదాగా ‘జక్కన్న’ టీజర్‌

సునీల్‌, మన్నారా చోప్రా జంటగా రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘జక్కన్న’. ఈ చిత్రం టీజర్‌ శుక్రవారం విడుదలైంది. హీరో సునీల్‌ సోషల్‌మీడియా ద్వారా ఈ టీజర్‌ను అభిమానులతో పంచుకున్నారు. ఇందులో నటుడు సప్తగిరి మార్షల్‌ ఆర్ట్స్‌ నిపుణుడి వేషంలో ‘నీకు మార్షల్‌ ఆర్ట్స్‌ తెలుసా?’ అని సునీల్‌ను ప్రశ్నిస్తే.. ‘నీకు గీతా ఆర్ట్స్‌ తెలుసా?’ అని సునీల్‌ సరదాగా సమాధానం ఇచ్చారు.
వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్‌. సుదర్శనరెడ్డి నిర్మిస్తున్నారు. వచ్చే నెలలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎందుకూ పనికిరాడు అనిపించుకున్న ఓ యువకుడు తనని తాను ఓ శిల్పంలా తీర్చిదిద్దుకొన్న వైనాన్ని ఈ చిత్రంలో చూపామని నిర్మాత ఇటీవల ఓ కార్యక్రమంలో తెలిపారు. కబీర్‌ సింగ్‌, పృథ్వీ, నాగినీడు, రాజ్యలక్ష్మి తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి దినేష్‌ సంగీతం సమకూరుస్తున్నారు.
 


పోలీస్ స్టేషన్‌లో మహిళతో మసాజ్ చేయించుకున్న ఎస్‌ఐ

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ పోలీస్ స్టేషన్లో చేయకూడని పని చేశాడు ఒక పోలీస్ బాస్. ఉద్యోగం చేసి అలిసిపోయానని భావించాడో ఏమోగాని పోలీస్ స్టేషన్లోనే నేరుగా ఒక మహిళతో బాడీ మసాజ్ చేయించుకున్నాడు సబ్ ఇన్‌స్పెక్టర్ సంజయ్ యాదవ్. బట్టలు తీసేసి కింద కుర్చోగా మహిళ ఆయిల్‌తో బాడీ మొత్తం మసాజ్ చేసింది. ఈ తతంగం మొత్తం ఆమె మరిది ఎదురుగా కుర్చుని చూస్తూనే ఉన్నాడు. ఈ సంఘటనను చూసిన వాళ్లు చూసి ఊరుకుంటారా! వీడియో తీసి నెట్‌లో పెట్టడంతో సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో బాగా ప్రచారం పొందింది. అయితే ఈ విషయాన్ని డీజీ సీరియస్‌గా తీసుకున్నారు. దీంతో విచారణ జరిపించి ఎస్‌ఐను సస్పెండ్ చేశారు. బాడీ మసాజ్‌కు సంబంధించిన ఆయిల్‌ను ప్రత్యేకంగా తయారు చేస్తుంది దేవ్రియా గ్రామానికి చెందిన ఒక మహిళ. దీంతో ఈమెను స్టేషన్‌‌కు రమ్మని ఆర్డన్ వేసి మరీ ఆమెతో మసాజ్ చేయించుకున్నాడు ఎస్‌ఐ సంజయ్ యాదవ్.

Thursday, 16 June 2016

తల్లిపాలు తాగే పిల్లలకు యాంటీబయోటిక్స్‌ వద్దు!

తల్లిపాలు తాగడం మానేసేవరకూ పిల్లలకు ఎలాంటి యాంటీబయోటిక్స్‌ ఇవ్వకుండా ఉంటే... ఆ తర్వాత అసలు వాటి అవసరమే వారికి ఉండదని తాజా అధ్యయనమొకటి తేల్చింది. ఇలాంటి వారిలో రోగనిరోధకశక్తి సమృద్ధిగా ఉంటుందట. భవిష్యత్తులో వారి ఎత్తు, బరువు నిష్పత్తి సూచీ (బీఎంఐ) కూడా సాధారణ స్థాయిని మించదనీ తేలింది! ఫిన్‌లాండ్‌లోని ‘యూనివర్సిటీ ఆఫ్‌ హెల్సింకి’ పరిశోధకులు కత్రి కార్పెలా నేతృత్వంలో ఈ పరిశోధన సాగింది. చనుబాలు తాగేసమయంలో యాంటీబయోటిక్స్‌ను ఇవ్వకపోవడం వల్ల వారిలో రోగనిరోధకశక్తి వ్యవస్థ చాలా బలంగా తయారవుతుందనీ... ఫలితంగా భవిష్యత్తులో వ్యాధుల దాడిని వారి శరీరం దీటుగా ఎదుర్కోగలుగుతుందని స్పష్టంగా వెల్లడైనట్లు కత్రి పేర్కొన్నారు. ‘‘తల్లిపాలు తాగే పిల్లలకు యాంటీబయోటిక్స్‌ ఇస్తే, వారిలో జీవక్రియకు తోట్పడే పేగుల్లోని సూక్ష్మజీవి సమూహం (ఇంటెస్టినల్‌ మైక్రోబయోటా) విచ్ఛిన్నమైపోతుంది’’ అని వివరించారు. పరిశోధనలో భాగంగా 226 మంది చిన్నారుల ఆరోగ్యపరిస్థితిని పరిశోధకులు 2009నుంచి గమనిస్తూ వచ్చారు.

తలైవా అభిమానులకు మరో ట్రీట్‌

సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ గురువారం తన అభిమానులకు మరో ట్రీట్‌ ఇవ్వనున్నారు. ఇప్పటికే కబాలి టీజర్‌, ఆడియోను విడుదల చేసిన చిత్ర బృందం గురువారం సాయంత్రం 8 గంటలకు ఈ చిత్రంలోని ఓ పాట టీజర్‌ను విడుదల చేయనుంది. ఈ విషయాన్ని ‘కబాలి’ చిత్ర బృందం సోషల్‌మీడియా ద్వారా వెల్లడించింది. ఇది కచ్చితంగా తలైవా అభిమానులకు ఓ ట్రీట్‌ అవుతుందని పేర్కొంది. ఈ చిత్రంలో రజినీకాంత్‌ భార్య పాత్రలో రాధికా ఆప్టే నటించారు. పా రంజిత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కలైపులి ఎస్‌ థను నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. త్వరలో ‘కబాలి’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం టీజర్‌ యూట్యూబ్‌లో అత్యధిక హిట్స్‌తో రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.

గ్యాంగ్‌స్టర్‌ షకీల్‌ మృతి

 నయీమ్‌కు కుడిభుజం  
 పలు హత్య కేసుల్లో నిందితుడు  
 పీడీ యాక్ట్‌తో 3 నెలలుగా అజ్ఞాతం  
 గుండెపోటుతో మరణించిన షకీల్‌ 
        నయీముద్దీన్‌ ముఠాలో కీలక సభ్యుడు, గ్యాంగ్‌స్టర్‌ ఎస్‌కే షకీల్‌(45) గుండెపోటుతో మంగళవారం మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌ ప్రాంతంలోని కేసారం పరిసరాల్లో అజ్ఞాతంలో ఉన్న షకీల్‌ సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుండెపోటుకు గురయ్యాడు. అతని వెంట ఉన్న భార్య.. షకీల్‌ను సమీపంలోని మేడ్చల్‌ మెడిసిటీ ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారని కుటుంబసభ్యులు తెలిపారు. మాజీ మావోయిస్టు నేత సాంబశివుడి సోదరుడు కొనపురి రాములు హత్యతోపాటు పలు హత్యలు, కిడ్నాప్‌ కేసుల్లో షకీల్‌ ప్రధాన నిందితుడు. షకీల్‌పై 150కి పైగా కేసులున్నాయి. నయీముద్దీన్‌ ముఠాలో కీలక సభ్యుడిగా బెదిరింపులతో బలవంతపు వసూళ్లు, భూకబ్జావంటి ఘటనలకు పాల్పడడంతో షకీల్‌తోపాటు మరో ఇద్దరిపై పోలీసులు పీడీ యాక్ట్‌ ప్రయోగించారు. దీంతో మూడు నెలలుగా అతడు అజ్ఞాత జీవితం గడుపుతున్నాడు. సోమవారం రాత్రి షకీల్‌ గుండెపోటుతో మృతిచెందిన సమాచారం అందుకున్న ఆయన అనుచరులు, బంధువులు ఆస్పత్రికి వెళ్లి అంబులెన్స్‌లో మృతదేహాన్ని భువనగిరికి తరలించారు. షకీల్‌ మృతదేహాన్ని మంగళవారం పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు సందర్శించి సంతాపం తెలియజేశారు. టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ సుర్వి లావణ్య తదితరులు షకీల్‌ మృతదేహానికి నివాళులర్పించారు. కాగా మాజీ నక్సల్‌ నయీముద్దీన్‌కు ముఖ్య అనుచరుడుగా గుర్తింపు పొందిన షకీల్‌.. భువనగిరితో పాటు హైదరాబాద్‌ ప్రాంతంలో జరిగిన పలు హత్యలు, కిడ్నాపులు, భూకబ్జా కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. నయీమ్‌ గ్యాంగ్‌లో కీలక పాత్ర పోషించి తర్వాత.. భువనగిరి నుంచి మునిసిపల్‌ కౌన్సిలర్‌గా ఎన్నికై కొద్దిరోజులకే పదవికి రాజీనామా చేశాడు. 2014లో జరిగిన మునిసిపల్‌ ఎన్నికల్లో టీడీపీ నుంచి ఏకగ్రీవ కౌన్సిలర్‌గా ఎన్నికైన అతని భార్య..అధికార టీఆర్‌ఎ్‌సలో చేరారు.
షకీల్‌ అని తెలియదు: మెడిసిటీ
మేడ్చల్‌: షకీల్‌.. నయీమ్‌ అనుచరుడని తమకు తెలియదని మేడ్చల్‌ మెడిసిటీ ఆర్‌ఎంఓ నర్సింగ్‌రావు వెల్లడించారు. మంగళవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో షకీల్‌ను ఆస్పత్రికి తీసుకొచ్చారని, గుండెపోటు వచ్చిందని బంధువులు చెప్పడంతో పరీక్షలు నిర్వహించామని తెలిపారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు నిర్ధారణ అయిందని, తర్వాత మృతదేహాన్ని అతని బంధువులు తీసుకెళ్లిపోయారని పేర్కొన్నారు. కాగా షకీల్‌ మృతికి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, వరవరరావులే కారణమని అతని రెండో భార్య ఆరోపించారు. నయీంతో కలిసి తన భర్త నక్సలైట్లకు వ్యతిరేకంగా పోరాడిన తన భర్తపై ఎమ్మెల్యే, వరవరరావు కేసులు పెట్టి వేధించడం వల్లే మరణించాడని తెలిపారు.

స్వదేశం చేరుకున్న బాలకృష్ణ

హీరో నందమూరి బాలకృష్ణ అమెరికాలో వారం రోజుల పర్యటన ముగించు కుని మంగళ వారం నాడు శాన్‌ ఫ్రాన్సిస్కో విమానా శ్రయం నుండి హైదరాబాద్‌కు బయలుదేరారు. ఆయనకు విమానాశ్రయంలో అభిమానులు ఘనంగా వీడ్కోలు పలికారు. సియాటెల్‌ లో క్యాన్సర్‌ ఆస్పత్రికి విరాళాల సేకరణ కార్యక్రమంలో బాలకృష్ణ పాల్గొన్నారు. 10న సిలికాన్‌ వ్యాలిలోబాలకృష్ణ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు పెద్ద ఎత్తున నిర్వహించారు. అనంతరం శాంతాక్లారా యునివర్సిటీ నుండి బాలకృష్ణ రెండో కుమార్తె తేజస్విని గ్రాడ్యుయేషన్‌ కార్యక్రమంలో ఆయన కుటుంబం పాల్గొంది. సోమవారం నాడు స్టాన్‌ ఫోర్డ్‌ యూనివర్సిటిలో ఆయన చిన్నల్లుడు భరత్‌ గ్రాడ్యుయేషన్‌ కార్యక్రమంలో బాలకృష్ణ పాల్గొని, అనంతరం స్వదేశానికి బయలుదేరారు. బుధవారం తెల్లవారుజామున ఆయన హైదరాబాద్‌ చేరుకున్నారు.

జగ్గుభాయ్ బాగా బిజీ అయిపోయాడు....

బాబు డేట్స్ ఖాళీ లేవట..!
ఏ ముహూర్తాన బాలయ్య 'లెజెండ్'లో విలన్‌గా నటించాడో కానీ ఆ సినిమాతో జగపతిబాబు కెరీర్‌గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. ఆ చిత్రం సూపర్ డూపర్ హిట్ కావడంతో అప్పటి వరకు ఫ్యామిలీ హీరోగా పేరున్న బాబు.. సౌతిండియన్ స్టైలిష్ విలన్‌గా కొత్త అవతారం ఎత్తేశాడు. ఇప్పుడు దక్షిణాదిలో పలు చిత్రాల్లో ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. ఆచితూచి సినిమాలు చేస్తున్నా... జగపతిబాబు డైరీ పూర్తిగా నిండిపోవడంతో ఇటీవల మూడు క్రేజీ ప్రాజెక్ట్స్‌ను సైతం వదులుకోవాల్సి వచ్చిందట. ఏజ్ బార్ టైమ్‌లో హీరో పాత్రలకే పరిమితమైపోకుండా వైజ్ డెసిషన్ తీసుకోవడం జగ్గుభాయ్‌కు భలే కలిసొచ్చిందంటున్నారు పలువురు సినీజనం.

Wednesday, 15 June 2016

హత్య కేసులో 18 సింహాలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు !

అహ్మదాబాద్: ముగ్గురు మనుషులను హత్య చేశాయన్న అనుమానంతో 18 సింహాలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వినడానికి వింతగా అనిపించినా ఇది నిజం. ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగింది. అంతేకాదు, ఆ 18 సింహాల పాదముద్రలను కూడా పోలీసులు ఫోరెన్సిక్‌కు పంపించడం విశేషం. గుజరాత్‌లోని గిర్ నేషనల్ పార్క్‌కు చెందిన మగ సింహమే ఈ హత్యలకు కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే గానీ నిజమైతే సింహానికి జీవిత ఖైదు విధించే అవకాశముంది. గిర్ నేషనల్ పార్క్ ఏషియన్ సింహాలకు నిలయం. ఈ పార్క్‌లో దాదాపు 4వందల సింహాలు ఉన్నాయని అనధికారికంగా లెక్కలు వెల్లడిస్తున్నాయి. అయితే జూలో 270 సింహాలు ఉండటానికే వీలుందట. అందువల్లే పార్క్‌లోని కొన్ని సింహాలను అడవిలో వదిలేస్తున్నారట. అవి జనావాసాల్లో తిరుగుతూ ప్రజలను గాయపరుస్తున్నాయి.

కూతురు పక్కనుండగానే... పాపిష్టి పని చేశారు !

లిస్బన్‌: ఇది నిజంగా జుగుప్సాకరమైన సంఘటన. పట్ట పగలు, ఎంతో మంది ఉన్న పార్క్‌లో చిన్నారి కూతురి పక్కనే శృంగార కార్యకలాపానికి దిగింది ఓ జంట. ఇతర బంధువులు పక్కనే మాట్లాడుకుంటుండగా.. తమ కూతురు పక్కనే ఆ తల్లిదండ్రులు శృంగారం సాగించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ వీడియోలో ఉన్న మహిళ శృంగారంలో పాల్గొంటూనే పక్కనే ఉన్న కూతురితో మాట్లాడుతోంది. పక్కన ఉన్న ఎవరూ దీనిని పట్టించుకోలేదు. అయితే అక్కడే ఉన్న ఓ అజ్ఞాత వ్యక్తి ఎవరో ఈ దృశ్యాన్ని చిత్రీకరించి నెట్‌లో పెట్టాడు. దీని ఆధారంగా పోర్చుగల్‌ పోలీసులు ఆ వ్యక్తుల గురించి ఆరా తీస్తున్నారు. ఇతర దేశాల్లోలాగానే పోర్చుగీస్‌లో కూడా బహిరంగ శృంగారం నేరం. కాగా, సోషల్‌ మీడియాలో దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘తమ కూతురికి తల్లిదండ్రులుగా ఉండే అర్హత వారికి లేదు. ఆ చిన్నారికి ఇలాంటి తల్లిదండ్రుల నుంచి రక్షణ కల్పించాల’ని చాలామంది వ్యాఖ్యానించారు.

వేడి వేడిగా టీ, కాఫీలు తాగుతున్నారా? జాగ్రత్త..

మంచినీళ్ల తర్వాత ఎక్కువగా తాగే పానియం టీ,కాఫీలే. చాలా మందికి వీటిని తాగడం ఒక అలవాటు. ఎలాగంటే రోజుకు ఒకసారి రెండుసార్లు కాదు గంటకొకసారి కూడా తాగేవాళ్లుంటారు. అది కూడా వేడి వేడిగా పొగలు రావాలి మరి. ఇక్కడే అసలు సమస్య ఉంది. అతి వేడిగా ఉండే ఎటువంటి ద్రవ పదార్ధమైనా సరే కాన్సర్‌‌కు కారణమయ్యే అవకాశముందట. ఈ మేరకు తాజా వివరాలను తెలియజేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఆస్వాదించే విధంగా కొద్దిపాటి వేడిగా ఉంటే సరిపోతుందని మితిమీరిన వేడి పనికిరాదని సూచిస్తున్నారు పరిశోధకులు. వేడి ద్రవం కడుపులోపల చర్మిన్ని కాలుస్తుంది. గొంతు భాగం కాలి అక్కడ ట్యూమర్లు ఏర్పడే అవకాశాన్ని కల్పింస్తుందట. అన్నం, కూర వంటి డైలీ తీసుకునే ఆహార పదార్ధాల విషయంలో కూడా ఇలానే వేడి పనికిరాదా అనే దానిపై ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని తెలిపారు విశ్లేషకులు. అయితే పొగ త్రాగకపోవడం, అతిగా ఆల్కమాల్ తాగడం వంటి వాటితో పోల్చితే ఈ వేడి ద్రవాలను తీసుకోవడం వల్లే కలిగే ప్రమాదం తక్కువేనట.

పెట్రోల్ ధర ఎంత పెరిగిందో తెలిస్తే నిజంగా షాక్ అయిపోతారు!

న్యూఢిల్లీ: పెట్రోల్ ధర లీటర్‌కు ఐదు పైసలు పెరిగింది. డీజిల్‌పై లీటర్‌కు రూ 1.26 పైసలు పెరిగింది. సవరించిన ధరలు ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి.

పొద్దున్నే తినకపోతే.. ఏమవుతుందంటే..


రకరకాల కారణాలతో చాలామంది అమ్మాయిలు ఉదయం అల్పాహారం తీసుకునే విషయం పట్ల అంతశ్రద్ధ చూపరు. ఒకేసారి మధ్యాహ్నం భోజనం చేసేయొచ్చని అనుకుంటారు. కానీ అది పొరపాటు. పొద్దున్నే అల్పాహారాన్ని తినడం ఓ అలవాటుగా మార్చుకోవాలి. లేదంటే కొన్ని సమస్యలు తప్పవు.
స్థూలకాయం: ఒకేసారి మధ్యాహ్నం భోజనందాకా ఆగడం వల్ల ఆకలి పెరుగుతుంది. అతిగా తినేస్తాం. కెలొరీలు పెరగడానికి అదే కారణమవుతుంది. ఫలితంగా బరువు పెరిగి, అది క్రమంగా మధుమేహానికి దారి తీస్తుంది. సంతానసాఫల్య సామర్థ్యం లోపించడం, గుండెజబ్బుల్లాంటి సమస్యలూ తప్పకపోవచ్చు. ఒక్కసారి ఈ విధంగా పెరిగిన బరువుని అదుపులో ఉంచుకోవడమూ కష్టమే. పొద్దున్నే అల్పాహారం తీసుకోవడం వల్ల జీవక్రియల పనితీరు బాగుంటుంది.. శరీరానికి సరిపడా శక్తి అందుతుంది.
నెలసరి సమస్యలు: తరచూ అల్పాహారం మానేసే వారిలో నెలసరి సరిగ్గా రాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల ఆ సమయంలో విపరీతమైన నొప్పి కూడా బాధిస్తుంది. పైగా ఇలాంటివారిలో మలబద్ధకం కూడా ఎక్కువే అల్పాహారాన్ని మానేయడం వల్ల ఎదుగుదలపైనా ఆ ప్రభావం పడుతుంది.
మానసిక ఆరోగ్యం: పొద్దుటిపూట మూడీగా ఉండేవారు.. దాన్నుంచి బయటపడి ఉత్సాహంగా కనిపించాలంటే..అల్పాహారం తీసుకోవడానికి మించిన పరిష్కారం లేదని చెబుతున్నారు నిపుణులు. అలా తీసుకునేవారు రోజంతా చురుగ్గా ఉంటారని వారు సిఫారసు చేస్తున్నారు. పోషకభరితమైన అల్పాహారం మిమ్మల్ని రోజంతా చురుగ్గా ఉంచుతుంది.

Saturday, 11 June 2016

ఆగస్టులో క్రిష్‌ పెళ్లి

గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుమ్‌, కంచె వంటి విభిన్నమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన క్రిష్‌ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిస్తున్న ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న క్రిష్‌ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారు. హైదరాబాద్‌కు చెందిన రమ్య అనే డాక్టరుతో ఆగస్టులో క్రిష్‌ వివాహం జరగనుంది. చాలా రోజులుగా క్రిష్‌ తల్లి పెళ్లి చేసుకోమని చెబుతున్నా... వృత్తిపరంగా బిజీగా ఉంటున్న క్రిష్‌ దాన్ని వాయిదా వేస్తూ వచ్చారట. చివరికి పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవడానికి అంగీకరించారు. రమ్య, క్రిష్‌ ఇద్దరూ కలిసి మాట్లాడుకున్నారని, ఒకరికి ఒకరు నచ్చడంతో పెళ్లికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని సన్నిహితులు తెలిపారు. క్రిష్‌ సోదరుడు పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిరపడ్డారు.

రాజ్యసభ ఫలితాలు వెల్లడి..

రాజ్యసభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఏడు రాష్ట్రాల్లోని 27 రాజ్యసభ స్థానాలకు ఈ రోజు నిర్వహించిన పోలింగ్‌ ఫలితాలు వెలువడ్డాయి. ఉదయం 9 తొమ్మిది గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం నాలుగు గంటలకు ముగిసింది. మొత్తం 57 సీట్లకుగాను 30 సీట్లకు పోటీ లేకుండానే అభ్యర్థులు ఎన్నికయ్యారు. మిగిలిన 27 సీట్లకు ఈరోజు ఎన్నికలు జరిగాయి.
హరియాణాలో రెండు, ఉత్తర ప్రదేశ్‌లో 11, కర్ణాటకలో 4, మధ్యప్రదేశ్‌లో 3, రాజస్థాన్‌లో 4, ఉత్తరాఖండ్‌లో 1, జార్ఖండ్‌లో 2 సీట్లకు జరిగిన పోలింగ్‌ ఫలితాలిలా ఉన్నాయి..
* రాజస్థాన్‌లోని నాలుగు స్థానాల్లో భాజపా విజయం సాధించింది. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సహా.. భాజపా అభ్యర్థులు గెలుపొందారు.
* ఉత్తరాఖండ్‌లో ఒక స్థానానికి జరిగిన ఎన్నికలో కాంగ్రెస్‌ నేత ప్రదీప్‌ టంటా విజయం సాధించారు.
* మధ్యప్రదేశ్‌లో మూడు స్థానాలకు గానూ.. రెండింటిలో భాజపా గెలుపొందింది. భాజపా నుంచి ఎంజే అక్బర్‌, అనిల్‌ మాధవ్‌ దావే విజయం సాధించారు. మరో స్థానంలో కాంగ్రెస్‌ మద్దతుతో వివేక్‌ టంకా గెలుపొందారు.
* ఝార్ఖండ్‌లో రెండు స్థానాల్లో భాజపా జయకేతనం ఎగురవేసింది. కేంద్రమంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ, మహేశ్‌ పొడ్డార్‌ రాజ్యసభ స్థానాలను కైవసం చేసుకున్నారు.
* కర్ణాటకలోని నాలుగు సీట్లకు గానూ.. మూడు స్థానాల్లో కాంగ్రెస్‌ గెలుపొందగా.. ఒకస్థానాన్ని భాజపా కైవసం చేసుకుంది. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ భాజపా తరఫున విజయం సాధించారు. ఇక కాంగ్రెస్‌ నుంచి జైరాం రమేశ్‌, ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌, కేసీ రామ్మూర్తి గెలుపొందారు.
* హరియాణాలోని రెండు స్థానాలకు గానూ.. ఒక స్థానంలో భాజపా తరఫున కేంద్రమంత్రి బీరేందర్‌ సింగ్‌ విజయం సాధించగా.. మరో చోట భాజపా మద్దతుతో స్వతంత్ర అభ్యర్థి సుభాష్‌ చంద్ర గెలుపొందారు.
* ఉత్తరప్రదేశ్‌లో 11 స్థానాలకు గానూ.. సమాజ్‌వాదీ పార్టీ 7, బీఎస్పీ 2, భాజపా, కాంగ్రెస్‌ ఒకటి చొప్పున సీట్లు దక్కించుకున్నాయి. కాంగ్రెస్‌ నుంచి కపిల్‌సిబల్‌ గెలుపొందారు.

ఏ ఛానల్‌లో ఏ సినిమా!

ఈ వారాంతంలో బుల్లితెర ప్రేక్షకులను వినోదంలో ముంచెత్తేందుకు దాదాపు 15 ఛానెళ్లు 100 సినిమాలను ప్రసారం చేయనున్నాయి. మరి మిమ్మల్ని వెండితెరపై ఎంతగానో అలరించిన ఆ సినిమాలు ఏ ఛానెల్లో ప్రసారం కానున్నాయో తెలుసుకోవాలనుందా.. అయితే వివరాల కోసం క్లిక్‌ చేయండి..
http://www.eenadu.net/tv-movie-listings/tv-listings.aspx?lang=Telugu&day=sunday 

ఐసీయూలో ర‌జ‌నీకాంత్‌..!

సౌత్ ఇండియ‌న్ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన క‌బాలీ మూవీ కొద్ది రోజుల్లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ కళ్లు చెదిరే రీతిలో జ‌రుగుతోంది. ఇక క‌బాలీ టీజ‌ర్ కూడా యూ ట్యూబ్‌ను షేక్ చేసి పారేస్తోంది. ఇలా ఓ వైపు ఎక్క‌డ చూసినా క‌బాలీ గురించే డిస్క‌ర్ష‌న్లు జ‌రుగుతుంటే ఓ షాకింగ్ న్యూస్ ర‌జ‌నీ ఫ్యాన్స్‌తో పాటు యావ‌త్ సినీ అభిమానుల‌ను ఆందోళ‌న‌కు గురి చేస్తోంది.
ఫ్యామిలీతో హ్యాపీగా గడిపేందుకు రజనీ అమెరికా వెళ్లిన సంగతి తెల్సిందే! ఐతే ఏమైందోగానీ ఆకస్మాత్తుగా ఆయన అనారోగ్యం పాలవ్వడంతో వెంటనే ఐసీయూలో అడ్మిట్ చేసినట్టు సమాచారం. ఈ మ్యాట‌ర్‌ను ర‌జ‌నీ ఫ్యామిలీ మెంబ‌ర్స్ సీక్రెట్ ఉంచిన‌ట్టు కూడా స‌మాచారం. దీంతో ఈ వార్త సోష‌ల్ మీడియాలో జోరుగా ట్రెండ్ అవ్వ‌డంతో అంద‌రూ ర‌జ‌నీ హెల్త్ ఎలా ఉంద‌ని ఆరా తీస్తున్నారు.
ఇక క‌బాలీ ఆడియోను జూన్ 12న నేరుగా మార్కెట్లోకి రిలీజ్ చేస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ సినిమాను ముందుగా జూలై 1న రిలీజ్ చేస్తార‌ని వార్త‌లు వ‌చ్చినా ఇప్పుడు జూలై రెండో వారానికి వాయిదా ప‌డిన‌ట్టు తెలుస్తోంది. ఏదేమైనా ర‌జ‌నీ హెల్త్ గురించి ఫ్యాన్స్ కంగారుప‌డుతుండ‌డంతో ఆయ‌న ఆరోగ్యంపై ర‌జ‌నీ లేదా ఆయ‌న కుటుంబ స‌భ్యులు ప్ర‌క‌ట‌న చేస్తే ఫ్యాన్స్ శాంతిస్తారు.

‘జనతా గ్యారేజ్‌’ సెట్‌లో నితిన్‌

హైదరాబాద్‌: ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘జనతా గ్యారేజ్‌’ చిత్రం సెట్‌లో హీరో నితిన్‌ సందడి చేశారు. శుక్రవారం ఈ చిత్రం సెట్‌కు వెళ్లినట్లు నితిన్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలిపారు. చాలా కాలం తరువాత తారక్‌ను కలిశానని, ఆయన డ్యాన్స్‌ చూడటం ఓ ట్రీట్‌లా ఉందని ట్వీట్‌ చేశారు. ‘జనతా గ్యారేజ్‌’ చిత్రంలో సమంత, నిత్యా మేనన్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.

Friday, 10 June 2016

అతడు కాదు ఆమె...

                తొలుత ఎగతాళి చేసినవారే నేడు చప్పట్లు కొడుతున్నారు 
ఒరేగాన్: అమెరికా ఒరేగాన్‌కు చెందిన 39 ఏళ్ల రోజ్ గెయిల్‌ అనే మహిళకు 13వ ఏట నుంచే అవాంఛిత రోమాలు ఒంటి నిండా రాసాగాయి. దీంతో ఆమె కంగారు పడి రేజర్‌తో షేవింగ్ చేసుకునేది. చివరకు పరిస్థితి ఎలా తయారైందంటే షేవింగ్ చేసుకోకపోతే మరుసటి రోజుకు మీసం, గడ్డం కనిపించేది. అంతా ఎగతాళి చేసేవారు. దీంతో ఆమె చాలా ఒత్తిడికి గురైంది. దాదాపు పన్నెండేళ్ల వరకు రోజ్‌ జీవితం సాధారణంగానే గడిచింది. అయితే 12 ఏళ్ల తర్వాత ఒకరోజు అద్దం ముందు నిల్చుంటే తెలిసింది తనకు మీసం, గెడ్డం పెరుగుతోందని. వెంటనే ఎవరికీ చెప్పకుండా రేజర్‌తో క్లీన్‌ షేవింగ్‌ చేసుకుంది. రోజూ ఉదయం లేవగానే అలా షేవింగ్‌ చేసుకునే బయటకు వెళ్లేది. అలా రోజూ షేవింగ్‌ చేసుకుంటూనే పీజీ కూడా పూర్తి చేసింది. దాదాపు 26 సంవత్సరాల పాటు ఆమె రోజూ షేవింగ్‌ చేసేది. అయితే ఓ రోజు షేవింగ్‌ చేసుకోవడం మర్చిపోయి బయటకు వచ్చేయడంతో తల్లికి తెలిసిపోయింది. ఆమె మొదట కంగారు పడినా తర్వాత కూతురికి సపోర్ట్‌ చేసింది. ఇటీవల వాటిని పూర్తిగా నిరోధించుకోవడం కోసం లేజర్‌ ట్రీట్‌మెంట్‌ కోసం వెళ్లింది. ఆ చికిత్స పూర్తయిన రెండు నెలల వరకు బాగానే ఉన్న పరిస్థితి చివరకు మళ్లీ మొదటికొచ్చింది. దీంతో చేసేది లేక గడ్డంతోనే బయటకు వస్తోంది.  తల్లిదండ్రుల సహకారంతో డాక్టర్లను ఆశ్రయించి నానా మందులు మింగింది. ఆమె జీన్స్, పాలికిస్టిక్ ఓవరీ సిండ్రోమ్‌తో కలిసి అనూహ్యమైన హార్మోన్ అభివృద్ధికి దారి తీసిందని డాక్టర్లు చెప్పారు. అయితే ఆమె తొలుత ఆత్మన్యూనతకు గురైనా ఆ తర్వాత క్రమంగా దాన్నుంచి బయటపడ్డారు. గడ్డం, మీసాలు పెంచడం ప్రారంభించారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకున్నారు. దీంతో ఆమె చాలా ప్రత్యేకంగా కనిపించేవారు. క్రమంగా ఆమెకు ఆదరణ పెరిగింది. సోషల్ మీడియాలో కూడా ఫాలోయర్స్ పెరిగారు. రోజ్‌ను ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా చెప్పడం ప్రారంభించారు. పెళ్లి చేసుకుందామంటూ ప్రపోజ్ కూడా చేస్తున్నారు.

గంటకు 17 మంది..

దేశంలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో చనిపోయేవారి సంఖ్య ఇదీ..
పల్లె మలుపులే ప్రాణాంతకం
అత్యధిక ప్రమాదాలు గ్రామీణ ప్రాంతాల్లోనే
బైకుల మీద వెళ్తూ ఎక్కువ మంది మృతి
2015 నివేదిక విడుదల చేసిన నితిన్‌ గడ్కరీ
5 లక్షల ప్రమాదాల్లో 1.46 లక్షల మంది మృతి
తొలి పది రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణ
ప్రమాదాల్లో 10వ స్థానంలో హైదరాబాద్‌
విజయవాడది 16వ స్థానం విశాఖది 17వ స్థానం

 దేశంలోని రహదారులు రక్తమోడుతున్నాయి. ప్రమాదాలు ఏటా పెరిగిపోతున్నాయి. కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీ గురువారం విడుదల చేసిన 2015 నివేదిక ఇందుకు అద్దం పట్టింది. అంతకుముందు ఏడాదికంటే ప్రమాదాలు 2.5%, మృతుల సంఖ్య 4.6% పెరిగాయి. దేశంలో గంటకు 57 ప్రమాదాలు జరుగుతున్నాయి. 17 నిండు ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోతున్నాయి. ఈ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు మొదటి పది స్థానాల్లో నిలిచాయి. ఆంధ్రప్రదేశ్‌ 7వ స్థానంలో నిలిస్తే తెలంగాణ 10వ స్థానాన్ని ఆక్రమించింది. ప్రమాదాల్లో గ్రామాలు పట్టణాలను మించిపోయాయి. ఎక్కు ప్రమాదాలు ద్విచక్ర వాహనాల వల్లే జరుగుతున్నాయి. 28.8% ప్రమాదాలు వీటి ద్వారానే జరుగుతున్నాయి. సాయంత్రం మూడు నుంచి రాత్రి 9 గంటల వరకు అత్యధిక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.




నివేదికలో ముఖ్యాంశాలు
* దేశంలో 2014లో 4,89,400 ప్రమాదాలు జరిగితే 2015 నాటికి 5,01,423 లక్షలకు చేరాయి. * 2014లో 1,39,671 మంది చనిపోతే 2015లో 1,46,133 మంది దుర్మరణం చెందారు.
* 2014లో 4,93,474 మంది గాయపడగా 2015లో 5,00,279కి చేరింది.
* 2014లో ప్రతి 100 ప్రమాదాల్లో సగటున 28.5 మంది చనిపోగా 2015 నాటికి 29.1కి పెరిగింది.
* దేశంలో రోజూ 1,374 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. సగటున 400 మంది చనిపోతున్నారు.
* గత ఏడాది మరణాల్లో 51% మంది 15-34 ఏళ్లలోపు వారే. * 86.7% ప్రమాదాలు పదమూడు రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్నాయి.
* 2015లో 5,00,279 మంది గాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ 29,439 మందితో ఆరో స్థానంలో, తెలంగాణ 22,948 మందితో తొమ్మిదో స్థానంలో ఉన్నాయి.
* ప్రమాదాలకు డ్రైవర్ల పొరపాట్లే ప్రధాన కారణంగా(77.1 శాతం) నిలిచాయి.
* అతివేగంతో 62.2% ప్రమాదాలు జరిగాయి. 64,633 మంది మృతిచెందారు.
* మద్యం, డ్రగ్స్‌ సేవించి వాహనం నడిపిన కారణంగా 4.2% ప్రమాదాలు, 6.4% మరణాలు సంభవించాయి.
* 2015లో 57,083(11.4 శాతం) హిట్‌ అండ్‌ రన్‌ కేసులు నమోదయ్యాయి. 20,709 మంది చనిపోయారు.
* ఓవర్‌లోడ్‌ కారణంగా 77,116 ప్రమాదాలు జరిగాయి. 25,199 మంది చనిపోయారు.
* 28.4% ప్రమాదాలు జాతీయ రహదారుల్లో, 24% రాష్ట్ర రహదారుల్లో జరిగాయి. జాతీయ రహదారులపై ప్రమాదాలు, మృతులు ఏటేటా పెరుగుతున్నారు. * మార్చి, మే నెలల్లో అత్యధిక ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.
* గ్రామీణ ప్రాంతాలు అత్యంత ప్రమాదకరంగా మారాయి. 53.8% ప్రమాదాలు ఇక్కడే జరిగాయి. ఇందులో 61% మంది మరణించగా, 59.1% మంది గాయపడ్డారు.
* కూడళ్లే ప్రమాద కేంద్రాలుగా మారాయి. 49% ప్రమాదాలు ఇలాంటి చోటే చోటుచేసుకున్నాయి.
* నగరాల్లో జరిగిన ప్రమాదాల్లో హైదరాబాద్‌ 10వ స్థానంలో నిలిచింది. 2,761 ప్రమాదాలు జరగ్గా అందులో 425 మంది మరణించారు. 4,685 మంది గాయపడ్డారు.
* విజయవాడ 16వ స్థానంలో నిలిచింది. 1,644 ప్రమాదాల్లో 379 మంది చనిపోయారు. 1,548 మంది గాయపడ్డారు. విశాఖ 17వ స్థానంలో నిలిచింది. 1,637 ప్రమాదాల్లో 373 మంది చనిపోయారు. 1,313మంది గాయపడ్డారు.
X

ఏడాది నుంచి అతని గుండె బ్యాగ్‌లోనే ఉంది !

మిచిగాన్‌: గుండె ఒక్క క్షణం పనిచేయక పోతేనే ప్రాణం పోతుంది. అలాంటిది మిచిగాన్‌కు చెందిన ఓ వ్యక్తి గుండె లేకుండా ఏడాదిన్నరపైగానే బతికేశాడు. మిచిగాన్‌కు చెందిన సోదరులు స్టాన్‌ లార్కిన్‌ (24), డోమ్నిక్‌ (27)కు కార్డియోమ యోపతి అనే గుండె సంబంధిత వ్యాధి ఉంది. ఈ వ్యాధి కారణంగా గుండె ఏ క్షణంలోనైనా పనిచేయడం ఆపేయవచ్చు. ఎన్నో ఏళ్లు ఆ సోదరులు గుండె దాతల కోసం ఎదురు చూశారు. అయినా ఫలితం లేకపోవడంతో ‘సిన్‌ కార్డియో’ అనే కృత్రిమ గుండెను అమర్చుకున్నారు. ఆ కృత్రిమ గుండెను శరీరంలో కాకుండా ఒక బ్యాగ్‌లో పెట్టి దానిని వీపునకు తగిలించుకోవాలి. ఇద్దరూ మొదట్లో అలా కృత్రిమ గుండెలను అమర్చుకున్నారు. అయితే అన్న డోమ్నిక్‌కు గుండె తొందరగానే లభించింది. కానీ లార్కిన్‌ మాత్రం గుండె దాత కోసం సుదీర్ఘ కాలం ఎదురు చూడాల్సి వచ్చింది. దాదాపు 18 నెలల ఎదురు చూపుల అనంతరం అతనికి గుండె దాత దొరికారు. వెంటనే శస్త్రచికిత్స చేసి అతనికి గుండె అమర్చి.. కృత్రిమ గుండెను తొలగించారు. ఈ 18 నెలలు ఎక్కడికి వెళ్లినా లార్కిన్‌ ఆ బ్యాగ్‌ తగిలించుకునే వెళ్లేవాడు. అంతేకాదు దాదాపు ఆరు కిలోల బరువుండే ఆ బ్యాగ్‌ను తగిలించుకుని బాస్కెట్‌బాల్‌ కూడా ఆడేవాడు లార్కిన్‌.

మహేశ్‌ కొత్త సినిమాలో విలనెవరో తెలుసా?

మురుగదాస్‌ దర్శకత్వంలో మహేశ్‌బాబు కథానాయకుడిగా ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. కానీ ఇందులో దర్శకుడు, నటుడు ఎస్‌.జె. సూర్య ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నట్లు మురుగదాస్‌ సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు. ఎస్‌.జె. సూర్య తన తరువాత చిత్రంలో విలన్‌ పాత్ర పోషిస్తున్నారని, అతడితో కలిసి పనిచేయడానికి వేచి చూడాలని ట్వీట్‌ చేశారు. ఈ చిత్రంలో మహేశ్‌బాబు సరసన బాలీవుడ్‌ నటి పరిణితీ చోప్రా నటిస్తోంది.

దర్శకేంద్రుడిపై దాడికి యత్నం!

దర్శకేంద్రుడు కె. రాఘ వేంద్రరావుపై ఓ వ్యక్తి దాడికి యత్నిం చాడు. ఫిలింనగర్‌ వెంచర్‌-3లోని రాఘ వేంద్రరావు ఇంటివద్ద వీరంగం సృష్టించాడు. దర్శకుడిని దూషించి, దాడికి యత్నించడమే కాకుండా, ఆయన లగ్జరీ కార్లను ధ్వంసం చేశాడు. ‘‘శ్రీరామదాసు’ సినిమా కథ నాదే.....నన్ను గుర్తించకుండా అన్యాయం చేశావు....తీవ్రంగా నష్టపరిచావు’ అంటూ రాఘవేంద్రరావును దుర్భాషలాడిన ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. 
 
అనంతపురం జిల్లా నల్లమాడ మండలం ఉద్దులవాడపల్లికి చెందిన పీ రవీంద్ర(28) గురువారం ఉదయం 10 గంటల సమయంలో ఫిలింనగర్ వెంచర్‌-3లో నివసించే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నివాసానికి వచ్చాడు. అదే సమయంలో రాఘవేంద్రరావు తన కారులో బయటకు వెళ్తుండగా రవీంద్ర కారును అడ్డగించి ఆయనను దుర్భాషలాడుతూ డోరు పగలగొట్టేందుకు యత్నించాడు. దీంతో అక్కడున్న వాచ్‌మెన్  అడ్డుకున్నాడు. వాచ్‌మెన్‌ను కిందకు తోసేసి మళ్లీ రాఘవేంద్రరావు దగ్గరకు వెళ్లి ఆయనను బయటకు లాగేందుకు యత్నించాడు.
 
రాఘవేంద్రరావు కారు అద్దాలు దించి.. ‘ఎవరు నువ్వు.. ప్రాబ్లం ఏంటి’ అని ప్రశ్నించాడు. 2006లో తెరకెక్కించిన ‘శ్రీరామదాసు’ సినిమా కథ తనదేనని, ఆ కథను 2003లోనే రూపొందించి మీకు పంపించానని, అయితే సినిమాలో మాత్రం కథ రచయితగా తన పేరు పెట్టలేదంటూ.. ఎందుకలా చేశారని రాఘవేంద్రరావును రవీంద్ర నిలదీశాడు. ఆ సినిమా కథ జేకే భరవిదని, నీది కాదని రాఘవేంద్రరావు చెప్తుండగానే రవీంద్ర ఆయనను దూషిస్తూ.. ‘సినిమా కథ నాదైతే ఆయన పేరు ఎలా పెడతావ’ని ప్రశ్నించాడు. ఈ విషయంలో తనకు తీవ్ర అన్యాయం చేశావని ఆరోపిస్తుండగానే రాఘవేంద్రరావు కారులో వెళ్లిపోయారు.
 
ఆ తర్వాత రవీంద్ర రాఘవేంద్రరావు నివాసంలోకి చొచ్చుకెళ్లాడు. అక్కడ ఉన్న ఆడి, బెంజి, సాంత్రో కార్లను ధ్వంసం చేశాడు. ఇంటి అద్దాలు పగలగొట్టాడు. అడ్డువచ్చిన వాచ్‌మెన్‌పై దాడి చేశాడు. ఇళ్లంతా భీభత్సం సృష్టిస్తున్న సమయంలో రాఘవేంద్రరావు కొడుకు ప్రకాశ్ రావు బయటకు వచ్చి ఏం చేస్తున్నావంటూ నిలదీశాడు. ఆయనపై కూడా దాడి చేయడానికి యత్నిస్తున్న సమయంలో వాచ్‌మెన్ బాబు వెనుక నుంచి వచ్చి పట్టుకున్నాడు. ప్రకాశ్‌రావు కూడా రవీంద్రను పట్టుకొని సెక్యూరిటీ గదిలో వేసి పోలీసులకు సమాచారం అందించారు.
 
బంజారాహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రవీంద్రను అరెస్టు చేశారు. అతడిపై ఐపీసీ సెక్షన్ 452, 427కింద కేసులు నమోదుచేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడు రవీంద్ర బుధవారం సాయంత్రమే రాఘవేంద్రరావు ఇంటి ముందు రెక్కీ నిర్వహించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఘటన రాఘవేంద్రరావును భయభ్రాంతులకు గురి చేసింది.

అమెరికాలో భూకంపం

అమెరికాలో భూకంపం.. వణికిపోయిన కాలిఫోర్నియా
         అమెరికాలోని కాలిఫోర్నియా దక్షిణ భాగంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.2గా నమోదైంది. అంతా నిద్రిస్తున్నవేళ రాత్రి ఒంటిగంటా ఐదు నిమిషాలకు భూమి కంపించింది. బొర్రెగో స్ప్రింగ్స్ ప్రాంతానికి ఉత్తరంగా 13 మైళ్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. 30 సెకండ్ల పాటు భూమి కంపించింది. శాన్ డియాగో, లాస్‌ ఏంజెల్స్ సమీపంలో కూడా భూ ప్రకంపనలు వచ్చాయి. ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లుగా సమాచారం లేదు.

నాలుగు భాషల్లో దున్నేస్తున్న హ్యాండ్సమ్‌ విలన్‌

ఫ్యామిలీ హీరోగా అందరికీ సుపరిచితుడు జగపతిబాబు. 'లెజెండ్‌' సినిమాతో హ్యాండ్సమ్‌ విలన్‌గా గెటప్‌ మార్చాడు. పలు సినిమాల్లో విలన్‌గా నటించి మెప్పించాడు. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగానూ సినిమాకు బలం చేకూర్చడంలో జగపతిబాబు తన పాత్రకు న్యాయం చేస్తున్నాడు. ప్రస్తుతం తెలుగులోనే కాకుండా, తమిళం, మళయాళం, కన్నడ భాషల్లో ఫుల్‌ బిజీ అయిపోయాడు. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా స్పీడుగా దూసుకెళ్తున్నాడు.

తమిళంలో భరతన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఇళయదళపతి విజయ్‌ సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో 'నేనూ శైలజ..' ఫేం కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. విజయ్‌ తండ్రికి, జగపతిబాబు తండ్రికి మధ్య ఉన్న స్నేహంతో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు జగపతిబాబు. ఇళయదళపతి విజయ్‌తో నటించడం చాలా గొప్పగా ఉందంటున్నాడు ఈ డైనమిక్‌ నటుడు. విజయ్‌తో స్నేహం ఈ నాటిది కాదనీ, కానీ తనతో కలిసి తెరను పంచుకోవడం చాలా ఆనందంగా ఉందనీ అంటున్నారు జగపతిబాబు. ఇదే కాకుండా ఇంకా విశాల్‌తో ఒక సినిమాలోనూ ముఖ్య భూమిక పోషిస్తున్నాడు. మలయాళంలో మోహన్‌లాల్‌తో ఒక సినిమా చేస్తున్నాడు. ఇలా భాషతో సంబంధం లేకుండా పలు భాషల్లో బుల్లెట్‌ స్పీడుతో దూసుకుపోతున్నాడు జగపతిబాబు.

‘ఇంగ్లిష్‌’ కావాలి!

                            ఆంగ్ల మాధ్యమానికి ఫుల్‌ డిమాండ్‌.. పైలట్‌ ప్రాజెక్టుగా వరంగల్‌ జిల్లా

             సర్కారీ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియానికి డిమాండ్‌ పెరుగుతోంది. గతంలో ప్రైవేట్‌ బాటపట్టిన తల్లిదండ్రులు ఆంగ్లమాధ్యమం ఉన్న ప్రభుత్వ పాఠశాలలవైపు దృష్టి సారిస్తున్నారు. తమ పిల్లలను వాటిల్లో చేర్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే కొన్ని పాఠశాలలకే ప్రస్తుతం ఇంగ్లిష్‌ మీడియం పరిమితం కావడంతో వారు నిరాశకు లోనవుతున్నారు. ఉపాధ్యాయులకు శిక్షణ కూడా పూర్తికాకపోవడంతో వెనకడుగు వేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ స్కూళ్లలో తెలుగు మాధ్యమానికి సమాంతరంగా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభించాలని ఉపాధ్యాయ సంఘాల నుంచి డిమాండ్‌ ఉన్నప్పటికీ, మౌలిక వసతుల కొరతతో పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద వరంగల్‌ జిల్లాను ఎంపిక చేసి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించింది. జీరో ఎనరోల్‌మెంట్‌ ఉన్న 398 ప్రాథమిక స్కూళ్లలో సైతం ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. కానీ జీరో ఎనరోల్‌మెంట్‌ స్కూళ్లతో పాటు వివిధ జిల్లాల్లో ఇతర స్కూళ్లలో కూడా ప్రారంభించాలనే డిమాండ్లు వస్తున్నాయి.
 
                 ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ల ద్వారా ప్రతిపాదనలు పంపించాలని విద్యాశాఖ మంత్రి కడియంశ్రీహరి డీఈవోలను ఆదేశించారు. కానీ కొన్ని జిల్లాల్లో డీఈవోల నిర్లక్ష్యం కారణంగా ఇంకా స్కూళ్ల గుర్తింపు ప్రక్రియనే ప్రారంభం కాలేదు. 2016-17 విద్యా సంవత్సరం ప్రారంభానికి కేవలం నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో స్కూళ్లను ఎప్పుడు ఎంపిక చేస్తారని, ఉపాధ్యాయులకు ఎప్పుడు శిక్షణనిస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు వెంటనే స్కూళ్ల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు.
 
రంగారెడ్డి జిల్లాల్లో 382 స్కూళ్లు
రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంపిక చేసిన స్కూళ్లలో పనిచేసే టీచర్లకు ఆంగ్లబోధనపై శిక్షణ కూడా ఇచ్చారు. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 1591 ప్రాథమిక పాఠశాలలు న్నాయి. ఈ సంవత్సరం నుంచి 382 ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియంను బోధించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆంగ్ల బోధనకు సంబంధించి 1836 మంది టీచర్లకు స్పోకెన్‌ ఇంగ్లిష్‌లో శిక్షణ ఇచ్చి సన్నద్ధం చేశారు. నిజామాబాద్‌ జిల్లాలో 300 ప్రాథమిక స్కూళ్లల్లో ఇంగ్లిష్‌ మీడియాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.ఈ ఏడాది నుంచే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, ఇప్పటికీ ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వలేదు. ఈ నెలాఖరులోగా అందరికి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నల్లగొండ జిల్లాలో 46 పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంను ప్రారంభించేందుకు ప్రతిపాదనలు వచ్చాయి. ఖమ్మం జిల్లాలో ఈ ఏడాది 600 పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టాలని కలెక్టర్‌ ప్రతిపాదించారు. అయితే ఇప్పటి వరకు మండలస్థాయి ఎంఈవోల నుంచి ఏయే ప్రాంతాల్లో ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లు అవసరమనే ప్రతిపాదనలు జిల్లా విద్యాశాఖకు రాలేదు. కరీంనగర్‌ జిల్లాలో 768 ప్రాథమిక పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధించేందుకు అనుమతి ఇచ్చారు. దరఖాస్తు చేసుకునేందుకు 12వ తేదీ వరకు గడువు విధించారు.ఆదిలాబాద్‌ జిల్లాలో ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలను ప్రారంభించాలని 10 గ్రామ పంచాయతీలు తీర్మానం చేసి జిల్లా విద్యాశాఖ అధికారికి పంపాయి. మెదక్‌ జిల్లాలో ప్రతిపాదిత ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలు ఈ సంవత్సరం 31 ఉన్నాయి. ఇక్కడ కూడా ఉపాధ్యాయులకు ఇప్పటిదాకా ఎలాంటి శిక్షణ ఇవ్వలేదు.
 
పాలమూరు అధికారుల నిరాసకత్త 
మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఇంగ్లిషు మీడియం స్కూళ్ల ఏర్పాటుపై జిల్లా విద్యాశాఖ ఆశించిన రీతిలో స్పందించడం లేదు. జిల్లాలో 3,827 ప్రభుత్వ పాఠశాలలుండగా, ఇందులో 2,725 ప్రాథమిక పాఠశాలలున్నాయి. వీటిలో మారుమూల ప్రాంతాల్లో సైతం ఇంగ్లిషు మీడియం స్కూళ్లు నడపాలనే డిమాండ్‌ ప్రజల నుంచి వస్తోంది. ఆసక్తిగల స్కూళ్ల ప్రతిపాదనలు పంపాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఇటీవల సూచించినా, తగిన చర్యలు తీసుకోవడంలో జిల్లా విద్యాధికారులు విఫలమయ్యారు. ఇప్పుడిప్పుడే ప్రతిపాదనలు తీసుకుంటున్నామని, రెండు, మూడు రోజుల్లో ఎన్ని స్కూళ్ల నుంచి ప్రతిపాదనలు వస్తాయో తేలుతుందని డీఈవో విజయలక్ష్మీ బాయి తెలిపారు. అయితే జిల్లాలో మారుమూల ప్రాంతమైన దౌల్తాబాద్‌ మండలం రాళ్లగుట్టతండా, బోడమర్రిగడ్డ తండాల్లోని ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం లేదని, ఉంటే కనుక పిల్లలను అక్కడే చదవిస్తామని ఆయా తండాల వాసులు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. జిల్లావ్యాప్తంగా వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే, విద్యాశాఖ అధికారులు ఇందుకు విరుద్ధంగా ఇంగ్లిషు మీడియంను ప్రారంభించేందుకు ఆయా స్కూళ్ల నుంచి సానుకూలత రావడం లేదని చెప్తుండడం గమనార్హం.

వరంగల్‌ జిల్లాలో పైలట్‌
వరంగల్‌ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యాసంవత్సరం నుంచే ఆంగ్ల మాద్యమాన్ని ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. జిల్లాలో 746 పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియాన్ని ప్రారంభించనున్నారు. ఇందులో ప్రాథమిక పాఠశాలలు 349, ప్రాథమికోన్నత పాఠశాలలు 127 ఉన్నాయి. 5,4158 మంది విద్యార్థులున్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో సుమారు 1900 మంది ఉపాధ్యాయులకు ఆంగ్ల మాధ్యమంలో బోధించేందుకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు.

ఒకే స్కూలు నుంచి 1800 దరఖాస్తులు
కొత్తగూడెం మండలం పాతకొత్తగూడెం ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక దశ నుంచే ఇంగ్లిష్‌ మీడియం పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. దీనిపై కొన్ని రోజులుగా విస్తృత ప్రచారం నిర్వహించారు. దీంతో మొత్తం 1800మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. మెరిట్‌ను బట్టి సీట్లు ఇవ్వడం, అవసరమైన అదనపు సెక్షన్లు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.

‘ప్రేమమ్‌’లో వెంకటేశ్‌?

హైదరాబాద్‌: చందు మొండేటి దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య, శ్రుతిహాసన్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘ప్రేమమ్‌’. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేశ్‌ అతిథి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఎస్‌. రాధాకృష్ణ, ఎస్‌. నాగవంశీ, పి.డి.వి. ప్రసాద్‌ ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. గోపీసుందర్‌, రాజేష్‌ మురుగేశన్‌ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ప్రేమమ్‌ అనే మలయాళం చిత్రం రీమేక్‌గా అదే టైటిల్‌తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్‌, చైతన్య కృష్ణ, ప్రవీణ్‌, జోష్‌ రవి, బ్రహ్మాజీ తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

పాకిస్థాన్‌కు అమెరికా గట్టి హెచ్చరిక

వాషింగ్టన్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆవేదనను అమెరికా అర్థం చేసుకుంది. ‘‘మా పొరుగు దేశం ఉగ్రవాదాన్ని ఉత్పత్తి చేస్తోంది’’ అని అమెరికా కాంగ్రెస్ ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడుతూ మోదీ ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై అమెరికా స్పందిస్తూ పాకిస్థాన్‌కు గట్టి హెచ్చరిక చేసింది. భారతదేశంలో దాడులకు పాకిస్థాన్‌ భూభాగంలో కుట్ర జరగకుండా జాగ్రత్త వహించాలని పాకిస్థాన్‌కు స్పష్టంగా చెప్పింది. అమెరికా హోం శాఖ ఉప అధికార ప్రతినిధి మార్క్ టోనర్ మాట్లాడుతూ భారతదేశంతో సంబంధాలను మెరుగుపరచుకోవాలని పాకిస్థాన్‌ను ప్రోత్సహించే చర్యల్లో ఇదొకటని పేర్కొన్నారు.
        పరస్పర సహకారం వల్ల పాకిస్థాన్, భారతదేశం లాభపడతాయన్నారు. ఉద్రిక్తతలను తగ్గించుకోవడం, సహకారాన్ని పెంపొందించడం లక్ష్యంగా చర్చలకు ప్రోత్సహిస్తామన్నారు. భారతదేశంలో దాడులకు పాకిస్థాన్ భూభాగంలో ప్రణాళిక రచన జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం పాక్ భూభాగాన్ని ఉపయోగించుకుంటున్న ఉగ్రవాదుల సమస్యను ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

ఎయిరిండియా ఓ ఐరావతం.. కొనే నాథుడెవరు?

న్యూఢిల్లీ : ‘ఎయిరిండియాను విక్రయించాలని ప్రయత్నించినా ఎవరూ కొనేందుకు ముందుకు రానంత దారుణంగా ఆ సంస్థ పరిస్థితి దిగజారిపోయింది’. పౌరవిమానయానశాఖ మంత్రి అశోక్‌ గజపతిరాజు స్వయంగా ఈ విషయం చెప్పారు. 50 వేల కోట్ల రూపాయల మేరకు నష్టాలు పేరుకుపోయిన ఎయిరిండియాలో వాటాల విక్రయానికి అవకాశమే లేదని ఆయన తేల్చి చెప్పారు. ఒకవేళ ప్రభుత్వం అమ్మాలనుకున్నా దాని కొనే నాథుడెవరు అని ఆయన ప్రశ్నించారు. అలాగని ఆ సంస్థను ఆదుకునేందుకు ప్రజలు పన్నుల ద్వారా చెల్లించిన సొమ్మును ఇవ్వలేమని ఆయన అన్నారు. ఎయిరిండియా, ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ 2007 సంవత్సరంలో విలీనం అయిన నాటి నుంచి సంస్థ రుణాల ఊబిలో కూరుకుపోయింది. యుపిఏ ప్రభుత్వ హయాంలో ప్రకటించిన 30 వేల కోట్ల రూపాయల బెయిల్‌ అవుట్‌ ప్యాకేజీపై మనుగడ సాగిస్తోంది. ఈ దుస్థితికి అందరి వలె తాను ఎయిరిండియాను దుయ్యబట్టాలనుకోవడంలేదని, కానీ టర్న్‌ ఎరౌండ్‌ లక్ష్యాలు సాధించాలంటే మరింత సమన్వయంతో పని చేయాల్సి ఉంటుందని రాజు అన్నారు. ‘ఎయిరిండియా చక్కని సంస్థ, నేను సంస్థను చాలా ఇష్టపడతాను... అయినా ప్రజల సొమ్ము మాత్రం ధారాదత్తం చేయలేను’ అని ఆయన తేల్చి చెప్పారు. ఎయిరిండియా సిబ్బంది అందరూ ఒక టీమ్‌గా శ్రమించి పని చేసే ధోరణి పెరగాలని ఆయన అన్నారు. వారు టీమ్‌స్పిరిట్‌తో పని చేసిన చోట్ల చక్కని ఫలితాలు సాధించారు... అది కొరవడిన ప్రదేశాల్లో బోర్లా పడ్డారని ఆయన వ్యాఖ్యానించారు. సంస్థ చరిత్రలో తొలిసారిగా గత ఏడాది ఎయిరిండియా నిర్వహణాపరమైన లాభాలు ఆర్జించినా దానిపై అధికార ప్రకటన ఏదీ లేదు. కాని ఆర్థిక స్థితి మెరుగుపడడంతో దేశీయ విమానయాన రంగంలోని భారీ అవకాశాలు చేజిక్కించుకునే లక్ష్యంతో రానున్న నాలుగేళ్ళలో కొత్తగా 100 విమానాలు కొనుగోలు చేసే ప్రయత్నంలో ఉంది. అయితే నిర్వహణాపరమైన నష్టాలు రాకపోవడం ఎయిరిండియాకు వస్తున్న ఆదాయాలకు సాక్ష్యమని రాజు అన్నారు. అత్యున్నతమైన ఎత్తులకు దూసుకుపోయే సామర్థ్యం సంస్థకున్నదని తాను విశ్వసిస్తున్నానంటూ తాను ప్రభుత్వ రంగానికి వ్యతిరేకం కాదని, అలా ఎన్ని ఇక్కట్లు ఎదుర్కొంటున్నా ప్రభుత్వరంగానికే అండగా నిలవాలని భావించబోనని ఆయన స్పష్టం చేశారు. డిజిసిఏ తాజాగా ప్రకటించిన గణాంకాల ప్రకారం ఎయిరిండియా దేశీయంగా ఏప్రిల్‌ నెలలో 15.1 శాతం మార్కెట్‌ వాటాతో 11.98 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది.
 
విమాన చార్జీలను నియంత్రించలేం
విమానయాన సంస్థలు ఏకపక్షంగా చార్జీలను పెంచేస్తున్నాయంటూ ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వస్తున్నంత మాత్రాన విమానయాన చార్జీలను ప్రభుత్వం నియంత్రించబోదని రాజు స్పష్టం చేశారు. చార్జీలు ఎలా ఉండాలన్నది ఎయిర్‌లైన్స్‌ మధ్య పోటీయే నిర్ణయిస్తుందని ఆయన అన్నారు. విమానయాన చార్జీలను నియంత్రించడం వల్ల ప్రాంతీయ కనెక్టివిటీని పెంచేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు విఘాతం ఏర్పడుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

స్వాతంత్య్ర సమరయోధుడి కన్నుమూత...


    కోల్‌కతా: స్వాతంత్య్ర పోరాటంలో జాతిపిత మహాత్మాగాంధీతో కలిసి పనిచేసిన సమరయోధుడు సుభాంశు జిబాన్‌ గంగూలీ గురువారం మరణించారు. 99 ఏళ్ల గంగూలీ గుండె పోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పశ్చిమ్‌బంగా స్వాతంత్య్ర యోధుల సలహాదారుల సంఘానికి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఆయన బుధవారం కూడా విధులకు హాజరయ్యారు.      గంగూలీ ఢాకా(ప్రస్తుత బంగ్లాదేశ్‌ రాజధాని) జిల్లాలోని విక్రంపూర్‌లో జన్మించారు. తన పదమూడవ ఏటనే బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు ప్రఫుల్ల చంద్రఘోష్‌కి ఉత్తరాల రాయబారిగా ఉండేవాడు. పదిహేనేళ్ల వయసులోనే జైలుకెళ్లారు. 1930లో తంగలుబెరియా పోలీస్‌ స్టేషన్‌ ముట్టడించినందుకు రెండేళ్లు, క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు మూడేళ్లు జైలు జీవితం గడిపారు. 1946లో కోల్‌కతా, నోవఖలిలో జరిగిన అల్లర్ల సమయంలో గాంధీజీతో కలిసి శాంతియుత ఉద్యమంలో పాల్గొన్నారు.