సబ్జెక్టు శూన్యం...పరీక్షలో టాపర్..
బీహార్ : ‘‘పొలిటికల్
సైన్స్ అంటే వంటలు చేయడం, హెచటూఓ ఫార్ములాకు నీటితో సంబంధం లేదు’’. ఇది
బీహార్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంటర్ పరీక్షల్లో టాపర్స్‌గా నిలిచినవారిని
ఇంటర్వ్యూ చేస్తే వచ్చిన సమాధానాలు ఇవి. బీహార్‌లోని ఓ కాలేజీలో ఇంటర్
చదివిన రుబీ అనే అమ్మాయి స్టేట్ టాపర్‌గా నిలిచింది. మొత్తం 500 మార్కులకు
444 మార్కులు సాధించింది. దీంతో ఆమె తల్లిదండ్రులు సంబరాలు చేసుకున్నారు. ఓ
జర్నలిస్టు రుబీ ఇంటికి వెళ్లి ఇంటర్వ్యూ చేశారు. పొలిటికల్ సైన్స్ అంటే
ఏమిటని ఆయన ప్రశ్నించారు. అంతే మైండ్ బ్లాంక్ అయ్యే సమాధానం వచ్చింది.
పొలిటికల్ సైన్స్ అంటే వంటలు ఎలా చేయాలో నేర్పే సబ్జెట్ అని ఆమె సమాధానం
చెప్పింది. అలాగే ఇంటర్ ఫస్టియర్‌లో టాపర్‌గా నిలిచిన మరో అబ్బాయి కూడా ఇదే టైప్‌లో సమాధానం చెప్పాడు. హెచ్‌టువో ఫార్ములాకి...నీటికి సంబంధం లేదని అన్నాడు. ఈ ఇద్దరి ఇంటర్వ్యూ మీడియాలో రావడంతో బీహార్‌లో పెద్ద దుమారమే రేగింది. అంతే ఈ ఇద్దరికి మళ్లీ పరీక్షలు పెట్టాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. బీహార్‌లో విద్యా వ్యవస్థ చాలా దారుణంగా మారింది. పరీక్షల్లో మాస్ కాపియింగ్ జోరుగా సాగుతుంది.

No comments:
Post a Comment