మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్‌బాబు
కథానాయకుడిగా ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న
సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో
బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్
ప్రతినాయకుడిగా నటిస్తున్నట్లు
ఇటీవల వార్తలు వచ్చాయి. కానీ
ఇందులో దర్శకుడు, నటుడు ఎస్.జె.
సూర్య ప్రతినాయకుడి పాత్రలో
నటిస్తున్నట్లు మురుగదాస్
సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు.
ఎస్.జె. సూర్య తన తరువాత చిత్రంలో
విలన్ పాత్ర పోషిస్తున్నారని,
అతడితో కలిసి పనిచేయడానికి
వేచి చూడాలని ట్వీట్ చేశారు.
ఈ చిత్రంలో మహేశ్‌బాబు సరసన
బాలీవుడ్ నటి పరిణితీ చోప్రా
నటిస్తోంది.

No comments:
Post a Comment