100రూపాయలకు
4జి డేటా ఎంత వస్తుంది. ఎంత తక్కువ ధరకు అందించే నెట్‌వర్క్ అయినా 1జిబి
కూడా రాదు. అలాంటిది 93 రూపాయలకే 10జిబి 4జీ డేటాను అందిస్తామంటోంది
రిలయన్స్. రిలయన్స్ జియోస్ నెట్‌వర్క్ పొందిన వారికి మాత్రమే ఈ ఆఫర్
వర్తిస్తోంది. మిగిలిన నెట్‌వర్క్ ఆపరేటర్లు అందించే రేటు కంటే ఇది 94 శాతం
తక్కువ. 12 సర్కిల్స్‌లో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. వచ్చే వారం నుంచి ఈ
ఆఫర్ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు టెలికామ్ శాఖకు ఆర్‌కామ్ ఓ లేఖ
రాసింది. వచ్చేవారం నుంచి రిలయన్స్ జియో ఇన్‌ఫోకమ్ 4జీ నెట్‌వర్క్
తీసుకున్న వారికి 10జీబీ ఉచిత 4జీ సేవలు అందించనున్నట్లు లేఖలో పేర్కొంది.
అయితే సీడీఎమ్‌ఏ కస్టమర్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. దీని ప్రకారం
ఆర్‌కామ్ సీడీఎమ్‌ఏ కస్టమర్లు 4జీ కి అప్‌డేట్ చేసుకుంటే చాలు. అయితే ఈ
డేటా ప్యాక్‌కు సంబంధించిన ధరలు ఒక్కో సర్కిల్‌లో ఒక్కో విధంగా ఉండొచ్చని
సంస్థ తెలిపింది. ఏ సర్కిల్‌లోనైనా 93 రూపాయల నుంచి 97 రూపాయల మధ్యలోనే
ఉంటుందని రిలయన్స్ తెలిపింది. మరిన్ని వివరాలకు ఆర్‌కామ్ వెబ్‌సైట్‌ను
వీక్షించాలని సంస్థ పేర్కొంది.
No comments:
Post a Comment