Friday, 10 June 2016

హైదరాబాద్‌లో ఏడాదికి యాచకుల ఆదాయం ఎంతో తెలిస్తే షాకవుతారు ?

  • గ్రేటర్‌లో యాచకులకు దానం 
  ‘నగరంలో యాచకుల సంఖ్య 14 వేలు. ఏటా పౌరులు వారికి చేస్తున్న దానం రూ.24కోట్లు..’ ఇది ఓ స్వచ్ఛంద సంస్థ సర్వేలో తేలిన వాస్తవం. గ్రేటర్‌లో మొత్తం 221 జంక్షన్లు ఉండగా, 100కుపైగా ప్రధాన చౌరస్తాల్లో యాచకులుంటున్నారు. అయితే వారిలో కేవలం 2శాతం మాత్రమే నిజమైన యాచకులని, మిగిలిన 98 శాతం బిక్షాటనను వృత్తిగా మార్చుకున్నారని గుర్తించారు. హైదరాబాద్‌ను ‘బెగ్గర్‌ ఫ్రీ’ సిటీగా మార్చాలని సంకల్పించిన మేయర్‌ బొంతు రామ్మోహన్‌.. నగరంలోని యాచకులపై స్వచ్ఛంద సంస్థలతో కలిసి మరోమారు సర్వే నిర్వహించి నిజమైన వారిని గుర్తించాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఈనెల 23న స్వచ్ఛంద సంస్థల సమాఖ్య ప్రతినిధులతో ఆయన సమావేశమవుతున్నారు. పని చేసే స్థితిలో లేని వారిని గుర్తించి పునరావాసం కల్పించడంతో పాటు, ఇతర యాచకులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తామని మేయర్‌ గతంలోనే ప్రకటించారు. యాచకవృత్తి నివారణ, నిజమైన యాచకులకు పునరావాసం, దానం చేయకుండా అవగాహన కల్పించడంపైనా ఈనెల 23న జరిగే ఎన్జీఓల సమావేశంలో చర్చిస్తారు.

No comments:

Post a Comment