Thursday, 9 June 2016

బీహార్ టాపర్స్ స్కాంలో ఐదుగురు అరెస్ట్

పాట్నా: బీహార్ 12వ తరగతి ఫలితాల టాప్ ర్యాంకుల స్కాంలో ఐదుగురిని స్పెషల్ టాస్క్‌ఫోర్స్ గురువారం అరెస్ట్ చేసింది. ఓ ప్రైవేట్ కాలేజీలో ఏర్పాటు చేసిన కేంద్రంలో పరీక్షలు రాసిన కొందరికి ఇంటర్‌లో టాప్ ర్యాంకులు వచ్చాయి. ఆ విద్యార్థుల సామర్థ్యాన్ని ఓ టీవీ ఛానల్ వెలుగులోకి తెచ్చి వారి ర్యాంకులపై అనుమానం వ్యక్తం చేసింది.
స్పందించిన బోర్డు 14 మంది టాపర్స్‌కు తిరిగి పరీక్ష నిర్వహించగా ఒకరు గైర్హాజరయ్యారు. రీ ఎగ్జామ్‌లో వారి అసలు టాలెంట్ బయటపడింది. దీంతో ఈ స్కామ్‌కు సంబంధించి టాపర్స్‌తో పాటు అవకతవకలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేశారు. దర్యాప్తు కోసం ఏర్పాటైన స్పెషల్ టాస్క్‌ఫోర్స్ బృందం ఓ విద్యా సంస్థకు చెందిన ఇద్దరు ప్రిన్సిపాల్స్, ఒక ఉపాధ్యాయుడు, ఎగ్జామ్ బోర్డుకు చెందిన ఇద్దరు ఉద్యోగులను గురువారం అరెస్ట్ చేసింది.

No comments:

Post a Comment