‘ప్రేమమ్’లో వెంకటేశ్?
హైదరాబాద్:
చందు మొండేటి దర్శకత్వంలో అక్కినేని
నాగచైతన్య, శ్రుతిహాసన్ జంటగా
నటిస్తున్న చిత్రం ‘ప్రేమమ్’.
ఈ చిత్రంలో విక్టరీ వెంకటేశ్
అతిథి పాత్రలో కనిపించనున్నట్లు
సమాచారం. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్
పతాకంపై ఎస్. రాధాకృష్ణ, ఎస్.
నాగవంశీ, పి.డి.వి. ప్రసాద్ ఈ
చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
గోపీసుందర్, రాజేష్ మురుగేశన్
చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.
ప్రేమమ్ అనే మలయాళం చిత్రం
రీమేక్‌గా అదే టైటిల్‌తో ఈ
సినిమాని తెరకెక్కిస్తున్నారు.
అనుపమ పరమేశ్వరన్, చైతన్య
కృష్ణ, ప్రవీణ్, జోష్ రవి, బ్రహ్మాజీ
తదితరులు ఈ చిత్రంలో ప్రధాన
పాత్రలు పోషిస్తున్నారు.
No comments:
Post a Comment