Wednesday, 8 June 2016

జులై 11 నుంచి దేశవ్యాప్తంగా రైళ్లన్నీ నిలిచిపోనున్నాయా ?

ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేయడం చూశాం. లారీ డ్రైవర్లు సమ్మె చేయడం చూశాం. కానీ రైల్వే సిబ్బంది సమ్మె చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది ? దాని ప్రభావం జనజీవనంపై ఏ స్థాయిలో ఉంటుంది ? దేశ వ్యాప్తంగా ఉన్న 13 లక్షల మంది రైల్వే సిబ్బంది సమ్మె సైరన్ మోగించేందుకు సిద్ధమవుతున్నారు. 7వ పే కమీషన్ ప్రకారం వేతనాలు చెల్లించాలనేది రైల్వే యూనియన్ సంఘాల ప్రధాన డిమాండ్. ప్రభుత్వం తమ డిమాండ్‌పై స్పష్టమైన వైఖరి ప్రకటించకపోతే జులై 11 నుంచి సమ్మె చేస్తామని ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ ఎస్ గోపాల్ మిశ్రా తెలిపారు. ఇదేగానీ జరిగితే పరిస్థితి అత్యంత దారుణంగా మారే అవకాశముంది.

No comments:

Post a Comment