మిచిగాన్:
గుండె ఒక్క క్షణం పనిచేయక పోతేనే ప్రాణం పోతుంది. అలాంటిది మిచిగాన్‌కు
చెందిన ఓ వ్యక్తి గుండె లేకుండా ఏడాదిన్నరపైగానే బతికేశాడు. మిచిగాన్‌కు
చెందిన సోదరులు స్టాన్ లార్కిన్ (24), డోమ్నిక్ (27)కు కార్డియోమ యోపతి
అనే గుండె సంబంధిత వ్యాధి ఉంది. ఈ వ్యాధి కారణంగా గుండె ఏ క్షణంలోనైనా
పనిచేయడం ఆపేయవచ్చు. ఎన్నో ఏళ్లు ఆ సోదరులు గుండె దాతల కోసం ఎదురు చూశారు.
అయినా ఫలితం లేకపోవడంతో ‘సిన్ కార్డియో’ అనే కృత్రిమ గుండెను
అమర్చుకున్నారు. ఆ కృత్రిమ గుండెను శరీరంలో కాకుండా ఒక బ్యాగ్‌లో పెట్టి
దానిని వీపునకు తగిలించుకోవాలి. ఇద్దరూ మొదట్లో అలా కృత్రిమ గుండెలను
అమర్చుకున్నారు. అయితే అన్న డోమ్నిక్‌కు గుండె తొందరగానే లభించింది. కానీ
లార్కిన్ మాత్రం గుండె దాత కోసం సుదీర్ఘ కాలం ఎదురు చూడాల్సి వచ్చింది.
దాదాపు 18 నెలల ఎదురు చూపుల అనంతరం అతనికి గుండె దాత దొరికారు. వెంటనే
శస్త్రచికిత్స చేసి అతనికి గుండె అమర్చి.. కృత్రిమ గుండెను తొలగించారు. ఈ
18 నెలలు ఎక్కడికి వెళ్లినా లార్కిన్ ఆ బ్యాగ్ తగిలించుకునే వెళ్లేవాడు.
అంతేకాదు దాదాపు ఆరు కిలోల బరువుండే ఆ బ్యాగ్‌ను తగిలించుకుని
బాస్కెట్‌బాల్ కూడా ఆడేవాడు లార్కిన్.

No comments:
Post a Comment