తల్లిపాలు
తాగడం మానేసేవరకూ పిల్లలకు ఎలాంటి యాంటీబయోటిక్స్ ఇవ్వకుండా
ఉంటే... ఆ తర్వాత అసలు వాటి అవసరమే వారికి ఉండదని తాజా అధ్యయనమొకటి
తేల్చింది. ఇలాంటి వారిలో రోగనిరోధకశక్తి సమృద్ధిగా ఉంటుందట. భవిష్యత్తులో
వారి ఎత్తు, బరువు నిష్పత్తి సూచీ (బీఎంఐ) కూడా సాధారణ స్థాయిని మించదనీ
తేలింది! ఫిన్‌లాండ్‌లోని ‘యూనివర్సిటీ ఆఫ్ హెల్సింకి’ పరిశోధకులు
కత్రి కార్పెలా నేతృత్వంలో ఈ పరిశోధన సాగింది. చనుబాలు తాగేసమయంలో
యాంటీబయోటిక్స్‌ను ఇవ్వకపోవడం వల్ల వారిలో రోగనిరోధకశక్తి వ్యవస్థ
చాలా బలంగా తయారవుతుందనీ... ఫలితంగా భవిష్యత్తులో వ్యాధుల
దాడిని వారి శరీరం దీటుగా ఎదుర్కోగలుగుతుందని స్పష్టంగా వెల్లడైనట్లు
కత్రి పేర్కొన్నారు. ‘‘తల్లిపాలు తాగే పిల్లలకు యాంటీబయోటిక్స్ ఇస్తే,
వారిలో జీవక్రియకు తోట్పడే పేగుల్లోని సూక్ష్మజీవి సమూహం (ఇంటెస్టినల్
మైక్రోబయోటా) విచ్ఛిన్నమైపోతుంది’’ అని వివరించారు. పరిశోధనలో
భాగంగా 226 మంది చిన్నారుల ఆరోగ్యపరిస్థితిని పరిశోధకులు 2009నుంచి
గమనిస్తూ వచ్చారు.

No comments:
Post a Comment