అమృత్‌సర్:
‘ఆపరేషన్ బ్లూ స్టార్’ 32వ
వార్షికోత్సవం సందర్భంగా రేపు
స్వర్ణ దేవాలయం ఆవరణలోకి మీడియా
కవరేజ్‌ను అనుమతిస్తున్నట్లు
శిరోమణి గురుద్వారా పర్‌బంధక్
కమిటీ(ఎస్‌జీపీసీ) ఆదివారం ప్రకటించింది.
వినయపూర్వకమైన అభ్యర్థనతోనే
మీడియా వారిని అనుమతిస్తున్నామని
వారు దేవాలయ పవిత్రతను కాపాడాలని..
గతంలో కొంత మంది మీడియా సభ్యులు
తమ కార్యక్రమాలకు ఆటంకం కలిగించారని
ఎస్‌జీపీసీ ప్రధాన కార్యదర్శి
హరిచరణ్ సింగ్ తెలిపారు. మాకు
ఎల్లప్పుడూ మీడియా కవరేజ్,
మద్దతు కావాలని ఈ సందర్భంగా
హరిచరణ్ పేర్కొన్నారు. అయితే
జూన్ 6న జరగనున్న వార్షికోత్సవానికి
మీడియా ప్రతినిధులు స్వర్ణదేవాలయం
ఆవరణలోకి ప్రవేశించకుండా పోలీస్‌లు
సహకరించాలని పోలీస్ కమిషనర్,
జిల్లా పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్‌కు
శనివారం లేఖ రాయడం గమనార్హం.

No comments:
Post a Comment