పదేళ్లపాటు అత్యాచారం చేసిన విద్యాధికారికి జీవిత ఖైదు!
కలబురగి: బాలికను
పదేళ్లపాటు అత్యాచారం చేసి, 11 సార్లు గర్భవతిని చేసిన విద్యాధికారికి
కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లా సెషన్స్ కోర్టు రూ. 5వేల జరిమానాతో పాటు
జీవిత ఖైదు విధించింది. అంతేకాకుండా అతడి ఆస్తులను స్వాధీనం చేసుకుని
బాధితురాలకి రూ. 5 లక్షల నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ
చేసింది.
మారుతి
అమ్రెప్ప థారే(34) అనే వ్యక్తి బీదర్ జిల్లాలోని ఔరద్ పట్టణంలో 2002లో
స్కూల్ డెవలప్‌మెంట్ మానిటరింగ్ కమిటీ చైర్మన్‌గా పనిచేస్తున్న సమయంలో 8వ
తరగతి విద్యార్థినిపై మనసు పడ్డాడు. అప్పటికే అతడికి పెళ్లి అయ్యి, ఇద్దరు
పిల్లలు కూడా ఉన్నారు. పవిత్రమైన విద్యాశాఖలో పనిచేస్తున్న అతడి మనసు
కలుషితం అయింది. తాను ఇష్టపడ్డ ఆ 14 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకుంటానని ఆమె
తల్లిదండ్రులను అడిగాడు. అయితే వారు నిరాకరించారు. ఇక్కడే ఉంటే తమ బిడ్డను
ఏం చేస్తాడోనని భయపడిన ఆమె తల్లిదండ్రులు ఆమెను చదువుకోసం మంగళూరుకు
పంపించారు. ఆ విద్యార్థి ఆచూకీ తెలుసుకున్న మారుతి అక్కడికి వెళ్లి ఆమెను
తన ఇంటికి తీసుకొచ్చి వివాహం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న బాలిక
తల్లిదండ్రులు మారుతితో తమ కుతూరు ప్రేమలో ఉందేమో అనుకుని పట్టించుకోలేదు.
బాలిక తల్లిదండ్రులు కూడా పట్టించుకోకపోవడంతో మారుతి సంతోషంగా ఫీలయి
బాలికను పూర్తిగా తనదాన్ని చేసుకున్నాడు. మారుతి వల్ల ఆ బాలిక 9 సార్లు
గర్భం దాల్చింది. అయితే గర్భం దాల్చిన ప్రతిసారీ ఆమెకు మారుతి అబార్షన్
చేయించేవాడు. అయితే పదోసారి గర్భవతి అయినప్పుడు అబార్షన్ చేయించకపోవడంతో ఆ
బాలిక ఓ బిడ్డకు జన్మనిచ్చింది. తన మృగ వాంఛలు తీర్చుకోవడం కోసమే ఆమెను
పెళ్లి చేసుకున్న మారుతి... బిడ్డ పుట్టడంతో అసౌకర్యంగా ఫీలయ్యి... ఆ
బిడ్డను మహారాష్ట్రలోని ఉదగిర్ అనాధాశ్రమంలో వదిలేశాడు.
2012లో
మరోసారి ఆమె గర్భవతి అయింది. ఎప్పటిలాగే ఆమె అబార్షన్ కోసం
తీసుకెళ్లడానికి మారుతి ప్రయత్నించాడు. వయసు పెరగడంతో మానసికంగా పరిణతి
చెందిన ఆమె...అబార్షన్ చేయించడం తప్పని, తాను బిడ్డను కనాలనుకుంటున్నానని
చెప్పింది. ఒక్కసారిగా అతడి మాటలకు ఆమె ఎదురుచెప్పడంతో ఆగ్రహించిన మారుతి
ఆమెను ఇంటి నుంచి గెంటేశాడు. దీంతో పుట్టింటికి వెళ్లిన ఆమె... పదేళ్లపాటు
తనను ఒక జంతువు కన్నా హీనంగా చూసిన మారుతిపై ఔరద్ పోలీస్ స్టేషన్‌లో
అత్యాచారం కేసు పెట్టింది. కేసు విచారణ చేసిన పోలీసులు... నిందితుణ్ని
బీదర్ జిల్లా సెషన్స్ కోర్టులో హాజరుపరిచారు. కేసును పరిశీలించిన అనంతరం
జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి సంజీవ్‌కుమార్ హంచతే గురువారం తీర్పు ఇచ్చారు.
బాధితురాలి పక్షాన పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామచంద్ర వాధించారు.

No comments:
Post a Comment