రకరకాల కారణాలతో చాలామంది అమ్మాయిలు ఉదయం అల్పాహారం తీసుకునే విషయం పట్ల అంతశ్రద్ధ చూపరు. ఒకేసారి మధ్యాహ్నం భోజనం చేసేయొచ్చని అనుకుంటారు. కానీ అది పొరపాటు. పొద్దున్నే అల్పాహారాన్ని తినడం ఓ అలవాటుగా మార్చుకోవాలి. లేదంటే కొన్ని సమస్యలు తప్పవు.
స్థూలకాయం: ఒకేసారి మధ్యాహ్నం భోజనందాకా ఆగడం వల్ల ఆకలి పెరుగుతుంది. అతిగా తినేస్తాం. కెలొరీలు పెరగడానికి అదే కారణమవుతుంది. ఫలితంగా బరువు పెరిగి, అది క్రమంగా మధుమేహానికి దారి తీస్తుంది. సంతానసాఫల్య సామర్థ్యం లోపించడం, గుండెజబ్బుల్లాంటి సమస్యలూ తప్పకపోవచ్చు. ఒక్కసారి ఈ విధంగా పెరిగిన బరువుని అదుపులో ఉంచుకోవడమూ కష్టమే. పొద్దున్నే అల్పాహారం తీసుకోవడం వల్ల జీవక్రియల పనితీరు బాగుంటుంది.. శరీరానికి సరిపడా శక్తి అందుతుంది.
నెలసరి సమస్యలు:
తరచూ అల్పాహారం మానేసే వారిలో నెలసరి సరిగ్గా రాదని నిపుణులు
హెచ్చరిస్తున్నారు. దీనివల్ల ఆ సమయంలో విపరీతమైన నొప్పి కూడా బాధిస్తుంది.
పైగా ఇలాంటివారిలో మలబద్ధకం కూడా ఎక్కువే అల్పాహారాన్ని మానేయడం వల్ల
ఎదుగుదలపైనా ఆ ప్రభావం పడుతుంది.
మానసిక ఆరోగ్యం: పొద్దుటిపూట మూడీగా ఉండేవారు.. దాన్నుంచి బయటపడి ఉత్సాహంగా కనిపించాలంటే..అల్పాహారం తీసుకోవడానికి మించిన పరిష్కారం లేదని చెబుతున్నారు నిపుణులు. అలా తీసుకునేవారు రోజంతా చురుగ్గా ఉంటారని వారు సిఫారసు చేస్తున్నారు. పోషకభరితమైన అల్పాహారం మిమ్మల్ని రోజంతా చురుగ్గా ఉంచుతుంది.

No comments:
Post a Comment