Thursday, 2 June 2016

తెలంగాణకు ప్రధాని శుభాకాంక్షలు

దిల్లీ: ద్వితీయ ఆవిర్భావ దినోత్సవం జరుపుకొంటున్న తెలంగాణకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా ఏర్పడిన తెలంగాణ దేశాభివృద్ధికి తోడ్పడుతోందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. శ్రమించే తత్వమున్న తెలంగాణ ప్రజలు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారన్నారు. దేశాన్ని శక్తిమంతంగా తీర్చిదిద్దడంలో తెలంగాణ ప్రజల భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నానన్నారు.

No comments:

Post a Comment