దిల్లీ:
దేశంలో గత 17నెలల్లో రక్తమార్పిడి
కారణంగా 2234 మంది ప్రజలకు ప్రమాదకర
హెచ్‌ఐవీ వైరస్ సోకిందని
సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడైంది.
2014 అక్టోబరు నుంచి 2016 మార్చి వరకు
రక్తమార్పిడి ద్వారా 2234 మంది
ఎయిడ్స్ బారిన పడ్డట్లు నేషనల్
ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్(నాకో)
వెల్లడించింది. ఉత్తరప్రదేశ్‌లో
అధికంగా అధికంగా 361 కేసులు నమోదయ్యాయి.
292 కేసులతో గుజరాత్ రెండో స్థానంలో
ఉంది. మహారాష్ట్ర 276 కేసులతో,
దిల్లీ 264 కేసులతో తర్వాతి స్థానాల్లో
ఉన్నాయి.
చేతన్ కొఠారి అనే కార్యకర్త దాఖలు చేసిన సమాచార హక్కు పిటిషన్ ఆధారంగా ఎయిడ్స్ వ్యాధి సోకిన వారి వివరాలు వెల్లడయ్యాయి. రక్త దాతలకు కచ్చితంగా హెచ్‌ఐవీ, హెచ్‌బీవీ, హెపటైటిస్ సి, మలేరియా, సిఫిలిస్ తదితర పరీక్షలు చేయాల్సి ఉంటుంది. రక్తం సురక్షితమైనదని నిర్ధారించిన తర్వాతే ఇతరులకు ఎక్కించాలి. కానీ నిర్లక్ష్యం కారణంగా చాలా మంది బలవుతున్నారు. 2011 నాటికే భారత్‌లో హెచ్‌ఐవీ/ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్న వారు 20.9లక్షల మంది ఉన్నారని అంచనా. వీరిలో 86శాతం మంది 15నుంచి 49ఏళ్ల వయసు వారు.

No comments:
Post a Comment