రజనీకాంత్
కథానాయకుడిగా నటిస్తున్న ‘కబాలి’ విడుదలకు ముందే సంచలనాలు
నమోదు చేస్తోంది. ప్రపంచంలోనే అత్యధిక మంది వీక్షించిన టీజర్‌గా ఇప్పటికే
‘కబాలి’ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకూ ఆ టీజర్‌ను
2.20 కోట్ల మందికి పైగా వీక్షించడం విశేషం. ఈ నెల 11న విడుదలైన ‘కబాలి’
తమిళ గీతాలకూ అదే స్థాయిలో స్పందన వస్తోంది. ఇండియా, మలేసియా, సింగపూర్,
అమెరికా, బ్రిటన్, అరబ్ దేశాల్లోని రజనీ అభిమానులు ‘కబాలి’ వీడియో గీతాలను
పదే పదే వీక్షిస్తున్నారట. దీంతో విడుదలైన తొలి వారంలోపే యూట్యూబ్‌లో
‘కబాలి’ గీతాల వీక్షకుల సంఖ్య కోటికి చేరింది. ‘నెరుప్పుడా..’ అనే
గీతాన్ని విడుదలైన 24 గంటల్లోనే 20 లక్షల మందికి పైగా వీక్షించగా, ఇప్పటికి
ఆ సంఖ్య 43 లక్షలు దాటింది. ఇతర ఆన్‌లైన్ మాధ్యమాల్లోనూ ‘కబాలి’ గీతాల
శ్రోతల సంఖ్య పదిలక్షలకు పైనే ఉంది. ఆడియో గీతాలు విడుదలైన రోజున ఇండియా,
సింగపూర్, మలేసియా, శ్రీలంకల్లో ఐట్యూన్స్ ద్వారా అత్యధికంగా అమ్ముడైన
ఆల్బమ్‌గా ‘కబాలి’ సత్తా చాటింది. ఇక ‘కబాలి’ విడుదలయ్యాక ఎన్ని రికార్డులు
బద్దలుకొడుతుందో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. పా రంజిత్
దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతాన్ని
అందించారు. వచ్చే నెలలో ‘కబాలి’ విడుదల కానుంది.

No comments:
Post a Comment