ఏ ముహూర్తాన బాలయ్య
'లెజెండ్'లో విలన్‌గా నటించాడో కానీ ఆ సినిమాతో జగపతిబాబు కెరీర్‌గ్రాఫ్
అమాంతం పెరిగిపోయింది. ఆ చిత్రం సూపర్ డూపర్ హిట్ కావడంతో అప్పటి వరకు
ఫ్యామిలీ హీరోగా పేరున్న బాబు.. సౌతిండియన్ స్టైలిష్ విలన్‌గా కొత్త అవతారం
ఎత్తేశాడు. ఇప్పుడు దక్షిణాదిలో పలు చిత్రాల్లో ప్రతినాయకుడి పాత్ర
పోషిస్తున్నాడు. ఆచితూచి సినిమాలు చేస్తున్నా... జగపతిబాబు డైరీ పూర్తిగా
నిండిపోవడంతో ఇటీవల మూడు క్రేజీ ప్రాజెక్ట్స్‌ను సైతం వదులుకోవాల్సి
వచ్చిందట. ఏజ్ బార్ టైమ్‌లో హీరో పాత్రలకే పరిమితమైపోకుండా వైజ్ డెసిషన్
తీసుకోవడం జగ్గుభాయ్‌కు భలే కలిసొచ్చిందంటున్నారు పలువురు సినీజనం.

No comments:
Post a Comment