Wednesday, 1 June 2016

ఆపదలో నేస్తం ఫేస్‌బుక్‌, ఎఫ్‌ఎం రేడియో


  • సమాచారం అందించడంలో ముందడుగు 
  • హైదరాబాద్‌ ట్రాఫిక్‌ ఫేస్‌బుక్‌కు 2.42 లక్షల మంది ఫాలోవర్స్‌ 
  • మీడియాతో వాట్సప్‌ గ్రూప్‌ 
      రెండు వారాల క్రితం నగరంలో ఊహించని రీతిలో గాలివాన వచ్చింది. 20 నిమిషాల వ్యవధిలోనే పలుచో ట్ల చెట్లు కూలాయి. విద్యుత స్తంభాలు పడిపోయాయి. ప్రధాన కూడళ్లతో భారీ హోర్డింగ్‌లు కూలాయి. వాహనాలు ముందుకు కదిలే పరిస్థితి లేక పోవడంతో నగరమంతటా ట్రాఫిక్‌ జాం ఏర్పడింది. అందరూ ఆఫీసుల నుంచి ఇంటికి బయలుదేరే సమయం కావడంతో చాలా మంది ట్రాఫిక్‌ లో చిక్కుకుపోయారు. ముందుకు వెళ్లలేక, వెనక్కు మళ్లలేక అల్లాడిపో యారు. ఇలాంటి సమయంలో చాలా మంది ఉద్యోగులను అప్రమత్తం చేసింది హైదరాబాద్‌ ట్రాఫిక్‌ ఫేస్‌ బుక్‌. దీని ద్వారా ట్రాఫిక్‌ డీసీపీ స్థా యి అధికారి అందుబాటులోకి వచ్చి ఉద్యోగులకు సమాచారం ఇచ్చారు. నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జాం ఏర్పడింది. బయటకు వస్తే ఇ బ్బంది పడతారు. ఓ గంట పాటు కార్యాలయంలోనే ఉండండని ఫేస్‌ బు క్‌ ద్వారా ట్రాఫిక్‌ అధికారులు సమాధానం ఇచ్చారు. హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసు అధికారుల సూచనలు పాటించని వేలాది మంది కార్యాలయాల్లో నే ఉండిపోయారు. రోడ్డపై కూలిన చెట్లను తొలగించిన తర్వాత కార్యాల యం నుంచి బయటకు వచ్చి క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. ఇదే విధం గా ఎఫ్‌ఎం రేడియో వారికి కూడా ట్రాఫిక్‌ పోలీసులు ట్రాఫిక్‌ అప్‌డేట్స్‌ తెలియజేస్తూ అప్రమత్తం చేస్తున్నారు.
లక్షల్లో ఫాలోవర్స్‌
హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ ఫేస్‌బుక్‌కి 2.42 లక్షల మంది ఫాలో వ ర్స్‌ ఉన్నారు. నగర ట్రాఫిక్‌పై రోజుకు 20 నుంచి 30 మంది ఫేస్‌బుక్‌ ద్వారా ఫిర్యాదు చేస్తున్నారు. ఈ ఫిర్యాదులను ట్రాఫిక్‌ పోలీసులు ప్రింట్‌ తీసి డీసీపీలకు పంపుతున్నారు. నగరంలో ఎక్కడెక్కడ ఏ లోపాలపై ఫి ర్యాదులు వస్తున్నాయో డీసీపీలు పరిశీలించి సిబ్బందికి తగిన సూచనలు ఇస్తున్నారు. అత్యవసర సమయంలో డీసీపీలు ఫేస్‌బుక్‌ ద్వారా ఫాలోవ ర్స్‌కి అందుబాటులోకి వచ్చి స్వయంగా రిఫ్లై ఇస్తున్నారు. ఇటీవల వాహ నాలు, క్యాబ్‌లో ఎఫ్‌ఎం రేడియోని వినియోగంలోకి తెచ్చారు. గాలివానల వంటి అత్యవసర సమయాలు, వీఐపీల పర్యటనలు, ఊరేగింపులు, ధర్నా లు, ప్లీనరీలు వంటి సమయంలో నగర వాహనదారులను అప్రమత్తం చేయడానికి ట్రాఫిక్‌ పోలీసులు ఎఫ్‌ఎం రేడియోల ద్వారా సమాచారం ఇ స్తున్నారు. ఇతర రూట్లను సూచిస్తున్నారు. ఒక ఫేస్‌బుక్‌, ఎఫ్‌ఎం రేడి యో ద్వారా కాకుండా హైదరాబాద్‌ ట్రాఫిక్‌ లైవ్‌, హాక్‌ ఐ యాప్‌ల ద్వా రా ట్రాఫిక్‌ అప్‌డేట్స్‌ ఇస్తున్నారు.
వాట్సప్‌ గ్రూప్‌
నగరంలో ట్రాఫిక్‌ పరిస్థితితో పాటు, అత్యవసర పరిస్థితిలో నగర వా హనదారులకు సూచనలు అందజేయడానికి ట్రాఫిక్‌ పోలీసులు ఎలకా్ట్ర నిక్‌ మీడియా ప్రతినిధులతో కూడిన వాట్సాఫ్‌ గ్రూప్‌ని క్రియేట్‌ చేసే ఆ లోచనలో ఉన్నారు. ట్రాఫిక్‌ అప్‌డేట్స్‌ ఆ గ్రూపులో షేర్‌ చేసే యోచనలో ఉన్నారు. సమాచారం వేగంగా ప్రజలకు అందాలంటే ఫేస్‌బుక్‌, ఎఫ్‌ఎం రేడియోతో పాటు టీవీ ఛానళ్ల స్ర్కోలింగ్‌ని ఉప యోగించుకోవాలని అను కుంటున్నారు.
ప్రజల స్పందన పెరిగింది
సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు చాలామంది హైదరాబాద్‌ ట్రాఫిక్‌ ఫేస్‌బుక్‌ ఫా లోవర్స్‌గా ఉన్నారు. నగరంలో అత్యవసర పరిస్థితి సమయంలో వారిని ఫేస్‌బుక్‌ ద్వారా అప్రమత్తం చేస్తున్నాం. 40 ఏళ్ల యువత అంతా టెక్నా లజీని విరివిగా ఉపయోగించడంతో హైదరాబాద్‌ ట్రాఫిక్‌ లైవ్‌ యాప్‌, హాక్‌ ఐ యాప్‌లకు స్పందన వస్తోంది. వీటి ద్వారా కూడా ప్రయాణికు లను ఆప్రమత్తం చేస్తున్నాం. ఇటీవల గాలివాన సమయంలో ఎంఎఫ్‌ రేడియో ద్వారా స్వయంగా లైవ్‌లోకి వచ్చి నగర పరిస్థితి వి వరించా. ట్రాఫిక్‌ పోలీసుల చర్యలకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది.

No comments:

Post a Comment