నో పెట్రోల్..!

- దేవనగుంది పెట్రోల్ టర్మినల్‌లో సౌలభ్యాలు లేక..
- పోవడంపై ట్రక్కుల డ్రైవర్లు, క్లీనర్‌లు సమ్మెకు
- దిగుతున్నారు. దీంతో నగర పరిధిలో సోమవారం
- నుంచి పెట్రోల్ బంక్‌లు బంద్ కానున్నాయి.
- ఎన్ని రోజులు బంద్ చేస్తామన్న విషయం స్పష్టం చేయని అసోసియేషన్
- ప్రజల్లో ఆందోళన
దేవనగుంది
పెట్రోల్ టర్మినల్‌లో సౌలభ్యాలు లేకపోవడంపై ట్రక్కుల డ్రైవర్లు,
క్లీనర్‌లు సమ్మెకు దిగుతున్నారు. దీంతో నగర పరిధిలో సోమవారం నుంచి
పెట్రోల్ బంక్‌లు బంద్ కానున్నాయి. ఎన్ని రోజులు బంద్ చేస్తామనేది
అసోసియేషన స్పష్టం చేయలేదు. కొన్నేళ్ళ కాలంగా టర్మినల్‌లో సౌలభ్యాలు
కల్పించాలని డిమాండ్ చేస్తున్నా ఆయిల్ కంపెనీల ముఖ్యులు పట్టించుకోవడం
లేదన్నారు. హిందుస్తాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం, ఇండియన ఆయిల్
కార్పొరేషన ము ఖ్యులకు ఇప్పటికే బంద్ నోటీసు ఇచ్చామన్నారు. బెంగళూరు
పెట్రోలియం డీలర్స్ అసోసియేషన అధ్యక్షుడు రవీంద్రనాథ్ మాట్లాడుతూ ట్రక్కు
డ్రైవర్లకు 15 వేలు వే తనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ట్రక్కుల
డ్రైవర్‌లు, హెల్పర్ల సంఘం అధ్యక్షు లు శ్రీరాం మాట్లాడుతూ ట్రక్కుల్లో
పనిచేసేవారు దొంగలుగా వ్యవహరించాల్సిన పరిస్థి తి మార్పు రావాలంటే బంద్
పాటించక తప్పదన్నారు.
No comments:
Post a Comment