భారతీయ స్టాక్‌మార్కెట్లకు
‘బ్రెగ్జిట్’ శరాఘాతంలా తగిలింది.
వంద కాదు, రెండు వందలు కాదు ఏకంగా
వెయ్యి పాయింట్లకు పైగా సెన్సెక్స్
కోల్పోయింది. దీంతో మదుపర్లు
తీవ్రంగా నష్టపోయారు. దేశీయ
స్టాక్‌మార్కెట్లు చవిచూసిన
భారీ పతనాల్లో ఇది కూడా ఒకటి.
గత శుక్రవారం ఆర్‌బీఐ గవర్నర్ రఘురాం రాజన్ నిర్ణయంతో ఈ వారం ట్రేడింగ్ ఆరంభంలో స్టాక్‌మార్కెట్లు భారీగా పతనమవుతాయని అందరూ భావించారు. అంతేకాకుండా ఆ సమయంలో ‘బ్రెగ్జిట్’ కూడా మార్కెట్‌ను భయపెట్టింది. అయితే కీలక రంగాల్లో ప్రభుత్వం ఎఫ్‌డీఐలకు ఆమోదం తెలపడంతో మార్కెట్లు లాభాల బాటలో పయనించాయి. ఒక ఆపద గట్టెక్కిందని అందరూ వూపిరి పీల్చుకున్నారు. అయినా ‘బ్రెగ్జిట్’కు సమయం దగ్గరపడే కొద్దీ భయాలు మరింత పెరిగాయి. యూకే పౌరులు ‘బ్రెగ్జిట్’కే మద్దతు తెలపడంతో అనుకున్నదంతా జరిగింది.
ఇంట్రాడే పరంగా, ముగింపు విషయంలోనూ సోమవారంనాడు మార్కెట్లు ఎక్కువగా నష్టపోయినట్లు చరిత్ర చెబుతోంది. ముగింపు పరంగా చూస్తే ఒక రోజులో సెన్సెక్స్‌కు వచ్చిన 10 భారీ పతనాల్లో సోమవారం ఏడు, గురువారం రెండు, మంగళవారం ఒకటి ఉన్నాయి. ఇప్పుడు వీటికి శుక్రవారం వచ్చి తోడైంది.
స్టాక్
మార్కెట్ భారీ పతనాల్లో కొన్ని..

No comments:
Post a Comment