Thursday, 9 June 2016

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆ సిఎంను 7గంటలపాటు ప్రశ్నించిన సిబిఐ

న్యూఢిల్లీ: భార్యాబిడ్డలపై ఆస్తులు ఎలా కూడబెట్టాలో తనకు తెలియదని హిమాచల్ ప్రదేశ్ సిఎం వీరభద్ర సింగ్ సిబిఐతో చెప్పారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఆయన నేడు సిబిఐ ముందు హాజరయ్యారు. న్యూఢిల్లీ సిబిఐ ప్రధాన కార్యాలయంలో సిబిఐ అధికారులు ఆయన్ను ఏడు గంటలపాటు ప్రశ్నించారు. 2009-2012 మధ్య కాలంలో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించడంపై సిబిఐ ఆయన్ను ప్రశ్నించింది. తన పేరుతోపాటు భార్యాబిడ్డలపై ఆయన 6.03 కోట్ల రూపాయలు అక్రమంగా కూడబెట్టారు. దీనికి సంబంధించి వీరభద్రసింగ్ భార్య ప్రతిభా సింగ్, ఎల్‌ఐసీ ఏజెంట్ ఆనంద్ చౌహాన్, చున్నీలాల్ చౌహాన్‌లపై ఢిల్లీలో కేసు నమోదైంది. అయితే ఈ ఆరోపణలను వీరభద్ర సింగ్ తోసిపుచ్చారు. వీరభద్ర సింగ్ ఎల్‌ఐసీ పాలసీల ద్వారా ఆయన భార్య, ఇతర కుటుంబ సభ్యుల పేర్లపై డబ్బును దాచారని ఆరోపణలున్నాయి. చౌహాన్ అనే వ్యక్తి 5 కోట్ల రూపాయలను ఎల్‌ఐసీ పాలసీలకు డబ్బు ఇచ్చారు. ఇది ముమ్మాటికీ లంచమేనని సిబిఐ వాదిస్తోంది. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న వారందరినీ విచారిస్తామని సిబిఐ తెలిపింది.

No comments:

Post a Comment