Thursday, 9 June 2016

ఒక ఉద్యమం కోసం ఉద్యోగం మానేసి.. బాయ్‌ఫ్రెండ్‌కు పాలిస్తున్న మహిళ !

అట్లాంటా: అమెరికా అట్లాంటాకు చెందిన 36 ఏళ్ళ జెన్నిఫర్ తన బాయ్‌ఫ్రెండ్ బ్రాడ్‌కు పాలివ్వడానికి ప్రతిరెండు గంటలకొకసారి పాలివ్వడం కోసం ఉద్యోగం మానేసింది. అడల్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ రిలేషన్‌పిప్పులు ఏబీఆర్ అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో తాను ఈ పని చేస్తున్నానని ఆమె వెల్లడించింది. తొలుత ఏబీఆర్ గురించి చెబితే ఎవ్వరూ స్పందించలేదట. డేటింగ్ వెబ్‌సైట్లు వెతికింది. ప్రకటనలు కూడా ఇచ్చింది. అయితే ఆమెకు నిరాశే మిగిలింది. చివరకు తన చిన్ననాటి బాయ్‌ఫ్రెండ్ బ్రాడ్‌తో ఈ విషయం చెబితే ఎగిరి గంతేశాడట. ఎప్పుడో 20 ఏళ్ల కిందట కుమార్తెను కనడంతో జెన్నిఫర్‌కు పాలు వచ్చే అవకాశం లేదు. అందుకని ఆమె ఔషద మూలికలు వాడుతోంది. అంతేకాదు ప్రతి రెండు గంటలకొకసారి పాలకోసం యత్నిస్తుంటే ఫ్లో వస్తుందని యత్నిస్తున్నారు. పాలు తాగినప్పుడు తల్లికీ-బిడ్డకు అవినాభావ సంబంధం ఏర్పడినట్లే ఇలా బ్రెస్ట్ ఫీడింగ్ ద్వారా కూడా ఇద్దరి మధ్యా అన్యోన్య బంధం ఏర్పడుతుందని జెన్నిఫర్ వాదిస్తోంది. పైగా ఇలా పాలు తాగాక ప్రశాంతంగా నిద్ర పట్టడమే కాక శారీరక సామర్థ్యం కూడా పెరగడాన్ని తాను గమనించానని జెన్నిఫర్ అంటోంది. దీనికి బ్రాడ్ వంద శాతం మార్కులేశాడు. దీంతో ఈ జంట తమ బుర్రల్లోంచి పుట్టిన ఈ ఐడియాకు మరింత ప్రచారం తీసుకురావాలని మీడియా, సోషల్ మీడియా ద్వారా యత్నించారు. అయితే నెటిజన్లలో అనేకమంది వీరి ఆలోచనను తప్పుబడుతున్నారు. తల్లి నుంచి వచ్చే పాలు బిడ్డకు మాత్రమే మేలు చేకూరుస్తాయని, పెద్దవారికి కాదంటూ కామెంట్లు పెట్టారు. సంప్రదాయాలకు భిన్నంగా ఇలాంటి చేయడం తగదని మరికొందరు నెటిజన్లు సూచించారు.

No comments:

Post a Comment