Tuesday, 7 June 2016

ఇంటింటికి బీర్ పైపులైన్..అక్కడ జనాలకు పండగే పండగ.!

ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇవ్వడానికే మన ప్రభుత్వాలు నానా పాట్లు పడుతున్నాయి. కానీ ఆ దేశంలో మాత్రం ఓ బీర్ కంపెనీ బంపర్ ఆఫర్ ఇచ్చేసింది. మీరు ఓకే అంటే చాలు మీ ఇంటికే డైరెక్టుగా బీరు వచ్చేలా పైపులైన్ ఇస్తామని ప్రకటించింది. ఇదేం విడ్డూరం అనుకుంటున్నారేమో ఏం చేద్దాం కంపెనీకి వచ్చిన కష్టాలు అన్ని ఇన్ని కావు మరి. ఇంతకీ ఆ కంపెనీ ఏదేశంలో ఉంది..ఆ కంపెనీ పేరేంటన్న విషయం తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..
రాష్ట్రాల మధ్య వాటర్ పైపులు, దేశాల మధ్య పెట్రోలు పైపులు ఇప్పటి దాకా వీటి గురించే విన్నాం..చూశాం కూడా కానీ బెల్జియంలోని బ్రుగెస్ నగరంలో ఓ బీర్ కంపెనీ ఉంది దాని పేరు డీ హల్వే మాన్ బ్రేవరీస్..ఓనర్ గ్జావియర్ బెనస్డే. ఇప్పుడు ఈ కంపెనీ పెద్ద మనిషికి అనుకోని కష్టం వచ్చి పడింది. కొంతకాలంగా కంపెనీ తయారు చేసే బీర్ అమ్మకాలు విపరీతంగా తగ్గడంతో దీంతో ఆయనకు ఏం చేయాలో తోచలేదు. అసలు సమస్య ఎక్కడుందా అని పలుసార్లు ఆలోచించగా ఓ ఉపాయం తట్టింది.
 
అయితే బ్రుగెస్ నగరానికి 3కీలోమీటర్ల దూరంలో తన బీరు కంపెనీ ఉండటమే అసలు సమస్యగా ఆయన గుర్తించారు. బ్రుగెస్‌‌ను చారిత్రక నగరంగా యునెస్కో గుర్తించింది. దీంతో అక్కడున్న పలు కట్టడాల సంరక్షణ యునెస్కో చూసుకుంటోంది. ఇక కంపెనీ నుంచి బ్రూగెస్ వెళ్లే రోడ్లన్నీ చాలా ఇరుకుగా, వంకరటింకరగా ఉన్నాయి. కొన్ని చాలా కీలక మలుపులు, కాలువలు కూడా ఉండటంతో బీరు బాటిళ్లు తీసుకెళ్లే ట్రక్కులకు ఇబ్బందిగా మారింది. రోడ్లు వెడల్పు చేయాలని అధికారులను కోరినా యునెస్కో అభ్యంతారాలతో గ్జావియర్ దీంతో ఈ పెద్ద మనిషికి ఏం చేయాలో అర్ధం కాలేదు.
 
ఈ విషయం తెలుసుకున్న ఓ బార్ యజమాని గ్జావియర్‌‌కు ఓ బ్రహ్మాండమైన ఐడియా ఇచ్చారు. కంపెనీ నుంచి గోడౌన్‌‌కు పైపులైన్ వేసి దాని ద్వారా బీర్ పంపమన్నాడు. ఈ ఐడియా గ్జావియర్ కు నచ్చడంతో బీర్ పైపులైన్ వేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ పైపులైన్ నిర్మాణం కోసం దాదాపు 31 కోట్లు ఖర్చు చేస్తున్నారు.
 
మొత్తం 3కిలో మీటర్లు దూరంలో ఉన్న ఈ పైపులైన్ కొన్ని చోట్ల భూమికి 6 అడుగుల లోతులో మరికొన్ని చోట్ల 100మీటర్ల లోతులో నిర్మిస్తున్నారు. ఇలా మొత్తం మూడు పైపు లైన్లు ఉంటాయని గ్జావియర్ చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే గంటకు 1500 గాలన్ల బీరు సరఫరా చేసే అవకాశం ఉండటంతో గ్జావియర్ తెగ ఆనందపడిపోతున్నారు.

No comments:

Post a Comment