దేశంలో జరిగే
రోడ్డు ప్రమాదాల్లో చనిపోయేవారి సంఖ్య ఇదీ..
పల్లె మలుపులే ప్రాణాంతకం
అత్యధిక ప్రమాదాలు గ్రామీణ ప్రాంతాల్లోనే
బైకుల మీద వెళ్తూ ఎక్కువ మంది మృతి
2015 నివేదిక విడుదల చేసిన నితిన్ గడ్కరీ
5 లక్షల ప్రమాదాల్లో 1.46 లక్షల మంది మృతి
తొలి పది రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణ
ప్రమాదాల్లో 10వ స్థానంలో హైదరాబాద్
విజయవాడది 16వ స్థానం విశాఖది 17వ స్థానం
పల్లె మలుపులే ప్రాణాంతకం
అత్యధిక ప్రమాదాలు గ్రామీణ ప్రాంతాల్లోనే
బైకుల మీద వెళ్తూ ఎక్కువ మంది మృతి
2015 నివేదిక విడుదల చేసిన నితిన్ గడ్కరీ
5 లక్షల ప్రమాదాల్లో 1.46 లక్షల మంది మృతి
తొలి పది రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణ
ప్రమాదాల్లో 10వ స్థానంలో హైదరాబాద్
విజయవాడది 16వ స్థానం విశాఖది 17వ స్థానం
దేశంలోని రహదారులు రక్తమోడుతున్నాయి. ప్రమాదాలు ఏటా పెరిగిపోతున్నాయి. కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ గురువారం విడుదల చేసిన 2015 నివేదిక ఇందుకు అద్దం పట్టింది. అంతకుముందు ఏడాదికంటే ప్రమాదాలు 2.5%, మృతుల సంఖ్య 4.6% పెరిగాయి. దేశంలో గంటకు 57 ప్రమాదాలు జరుగుతున్నాయి. 17 నిండు ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోతున్నాయి. ఈ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు మొదటి పది స్థానాల్లో నిలిచాయి. ఆంధ్రప్రదేశ్ 7వ స్థానంలో నిలిస్తే తెలంగాణ 10వ స్థానాన్ని ఆక్రమించింది. ప్రమాదాల్లో గ్రామాలు పట్టణాలను మించిపోయాయి. ఎక్కు ప్రమాదాలు ద్విచక్ర వాహనాల వల్లే జరుగుతున్నాయి. 28.8% ప్రమాదాలు వీటి ద్వారానే జరుగుతున్నాయి. సాయంత్రం మూడు నుంచి రాత్రి 9 గంటల వరకు అత్యధిక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
* దేశంలో 2014లో 4,89,400 ప్రమాదాలు జరిగితే 2015 నాటికి 5,01,423 లక్షలకు చేరాయి. * 2014లో 1,39,671 మంది చనిపోతే 2015లో 1,46,133 మంది దుర్మరణం చెందారు.
* 2014లో 4,93,474 మంది గాయపడగా 2015లో 5,00,279కి చేరింది.
* 2014లో ప్రతి 100 ప్రమాదాల్లో సగటున 28.5 మంది చనిపోగా 2015 నాటికి 29.1కి పెరిగింది.
* దేశంలో రోజూ 1,374 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. సగటున 400 మంది చనిపోతున్నారు.
* 2015లో 5,00,279 మంది గాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ 29,439 మందితో ఆరో స్థానంలో, తెలంగాణ 22,948 మందితో తొమ్మిదో స్థానంలో ఉన్నాయి.
* ప్రమాదాలకు డ్రైవర్ల పొరపాట్లే ప్రధాన కారణంగా(77.1 శాతం) నిలిచాయి.
* అతివేగంతో 62.2% ప్రమాదాలు జరిగాయి. 64,633 మంది మృతిచెందారు.
* మద్యం, డ్రగ్స్ సేవించి వాహనం నడిపిన కారణంగా 4.2% ప్రమాదాలు, 6.4% మరణాలు సంభవించాయి.
* 2015లో 57,083(11.4 శాతం) హిట్ అండ్ రన్ కేసులు నమోదయ్యాయి. 20,709 మంది చనిపోయారు.
* ఓవర్‌లోడ్ కారణంగా 77,116 ప్రమాదాలు జరిగాయి. 25,199 మంది చనిపోయారు.
* గ్రామీణ ప్రాంతాలు అత్యంత ప్రమాదకరంగా మారాయి. 53.8% ప్రమాదాలు ఇక్కడే జరిగాయి. ఇందులో 61% మంది మరణించగా, 59.1% మంది గాయపడ్డారు.
* కూడళ్లే ప్రమాద కేంద్రాలుగా మారాయి. 49% ప్రమాదాలు ఇలాంటి చోటే చోటుచేసుకున్నాయి.
* నగరాల్లో జరిగిన ప్రమాదాల్లో హైదరాబాద్ 10వ స్థానంలో నిలిచింది. 2,761 ప్రమాదాలు జరగ్గా అందులో 425 మంది మరణించారు. 4,685 మంది గాయపడ్డారు.
* విజయవాడ 16వ స్థానంలో నిలిచింది. 1,644 ప్రమాదాల్లో 379 మంది చనిపోయారు. 1,548 మంది గాయపడ్డారు. విశాఖ 17వ స్థానంలో నిలిచింది. 1,637 ప్రమాదాల్లో 373 మంది చనిపోయారు. 1,313మంది గాయపడ్డారు.

No comments:
Post a Comment