
హైదరాబాద్: వందకు పైగా చిత్రాలను తెరకెక్కించిన కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఫాంటసీ థ్రిల్లర్ ‘శివనాగం’. ఈ సినిమా టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. విష్ణువర్ధన్, రమ్య, రాజేశ్ వివేక్ ఉపాధ్యాయ తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు. గురు కిరణ్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రాన్ని అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్‌తో తెరకెక్కించినట్లు యూనిట్ సభ్యులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నాని నటించిన ‘ఈగ’, ‘బాహుబలి’ చిత్రాలకు పనిచేసిన సాంకేతిక బృందం ఈ చిత్రానికి కూడా పనిచేసినట్లు పేర్కొన్నారు. ఈ చిత్రం స్క్రిప్టు కోసం 7 సంవత్సరాలు, సినిమా నిర్మాణానికి మూడేళ్లు పట్టినట్లు తెలిపారు. ఈ చిత్రంలో 120 అడుగుల పాము ఉండటం విశేషం. తెలుగు, కన్నడలో ఈ చిత్రాన్ని ఏకకాలంలో తెరకెక్కిస్తున్నారు. తమిళ్, హిందీలో డబ్ చేస్తున్నారు. జయంతిలాల్ గడ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ చిత్రం ఆడియోను జూన్‌లో, సినిమాను జులైలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
No comments:
Post a Comment