కర్ణాటకలోని మైసూర్ ప్యాలెస్‌లో
పెళ్లి సంబరాలు మొదలయ్యాయి.
దాదాపు 40ఏళ్ల తర్వాత మైసూర్
ప్యాలెస్‌లో పెళ్లి భాజాలు
మోగనున్నాయి. ఈనెల 27న యదువీర్
కృష్ణదత్త చమరాజ వడియార్, త్రిషికా
కుమారిల వివాహం జరగనుంది. ఈ
పెళ్లి వేడుకల్లో వివాహ ఆహ్వాన
పత్రికలు ప్రత్యేక ఆకర్షణగా
నిలిచాయి. వీవీఐపీలకు ఇవ్వడం
కోసం ప్రత్యేకంగా ఆహ్వాన పత్రికలను
రూపొందించారు. ఐదు రకాల పెళ్లి
కార్డులను తయారు చేయించారు.
రాజమాత ప్రమోదా దేవి ఇటీవల శృంగేరి
మఠాన్ని సందర్శించి శ్రీభారతి
తీర్థ ఆశీస్సులతో పెళ్లి కార్డుల
పంపకాన్ని ప్రారంభించారు.
బంగారు పూత పూసిన అక్షరాలతో వివాహ పత్రికలో పేర్లను ముద్రించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఈ వివాహ వేడుకకు ఆహ్వానించారు. రాజ కుటుంబంలో జరిగే ఈ వేడుకకు కర్ణాటక సీఎం సిద్ద రామయ్య, రాజస్థాన్ సీఎం వసుంధర రాజే, దేవగౌడ, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానించినట్లు సమాచారం.

No comments:
Post a Comment