నిఖిల్‌రెడ్డి ఆవేదన..
ఎత్తు పెంపు కోసం శస్త్ర చికిత్స..
హైదరాబాద్ : ఎత్తు పెంపు కోసమని నిఖిల్ రెడ్డి అనే యువకుడు నగరంలోని
గ్లోబల్ ఆస్పత్రిలో కొద్ది రోజుల క్రితం శస్త్ర చికిత్స చేయించుకున్న విషయం
విదితమే. నిఖిల్ మీడియాతో మాట్లాడుతూ.. శస్త్ర చికిత్స తర్వాత వైద్యులు
పట్టించుకోవడం లేదన్నారు. ఆపరేషన్ జరిగి 60 రోజులైనా ఎముక పెరగలేదని ఆవేదన
వ్యక్తం చేశారు. శస్త్ర చికిత్స వల్ల ఎలాంటి దుష్ప్రభావం ఉండదని గ్లోబల్
ఆస్పత్రి వైద్యులు చెప్పారని స్పష్టం చేశారు. వైద్యులు రెండు రోజుల్లో
నడిపిస్తామని చెప్పి మాట మార్చారు అని పేర్కొన్నారు.
ఎత్తు పెంపు
ఆపరేషన్ వల్ల తన ఉద్యోగం పోయిందని ఆవేదన వెలిబుచ్చారు. ఆపరేషన్ విషయంలో
వైద్యులు నిబంధనలు పాటించలేదని ఎంసీఐ(మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా)కి
ఫిర్యాదు చేస్తామని తెలిపారు. గ్లోబల్ ఆస్పత్రి వైద్యులపై న్యాయపరంగా
పోరాడుతామన్నారు. ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసినట్లు నిఖిల్ చెప్పారు.
నిఖిల్‌రెడ్డి నగర శివారులోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్
చదివాడు.
No comments:
Post a Comment