లిస్బన్:
ఇది నిజంగా జుగుప్సాకరమైన సంఘటన. పట్ట పగలు, ఎంతో మంది ఉన్న పార్క్‌లో
చిన్నారి కూతురి పక్కనే శృంగార కార్యకలాపానికి దిగింది ఓ జంట. ఇతర బంధువులు
పక్కనే మాట్లాడుకుంటుండగా.. తమ కూతురు పక్కనే ఆ తల్లిదండ్రులు శృంగారం
సాగించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ
వీడియోలో ఉన్న మహిళ శృంగారంలో పాల్గొంటూనే పక్కనే ఉన్న కూతురితో
మాట్లాడుతోంది. పక్కన ఉన్న ఎవరూ దీనిని పట్టించుకోలేదు. అయితే అక్కడే ఉన్న ఓ
అజ్ఞాత వ్యక్తి ఎవరో ఈ దృశ్యాన్ని చిత్రీకరించి నెట్‌లో పెట్టాడు. దీని
ఆధారంగా పోర్చుగల్ పోలీసులు ఆ వ్యక్తుల గురించి ఆరా తీస్తున్నారు. ఇతర
దేశాల్లోలాగానే పోర్చుగీస్‌లో కూడా బహిరంగ శృంగారం నేరం. కాగా, సోషల్
మీడియాలో దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘తమ కూతురికి
తల్లిదండ్రులుగా ఉండే అర్హత వారికి లేదు. ఆ చిన్నారికి ఇలాంటి తల్లిదండ్రుల
నుంచి రక్షణ కల్పించాల’ని చాలామంది వ్యాఖ్యానించారు.

No comments:
Post a Comment