Sunday, 14 August 2016

బీఎస్‌ఎన్‌ఎల్‌ స్వాతంత్య్రదినోత్సవ ఆఫర్‌

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ స్వాతంత్య్రదినోత్సవ సందర్భంగా తమ వినియోగదారుల కోసం కొత్త ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ప్రతి ఆదివారం ల్యాండ్‌లైన్‌ నుంచి దేశంలోని ఏ నెట్‌వర్క్‌ ల్యాండ్‌లైన్‌ లేదా మొబైల్‌ ఫోన్‌కు అపరిమిత కాల్స్‌ చేసుకునే సదుపాయం కల్పిస్తున్నట్లు టెలికాంశాఖ మంత్రి మనోజ్‌ సిన్హా వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ సంస్థ మరో ఆఫర్‌ను ప్రకటించింది. స్వాతంత్య్రదినోత్సవం(ఆగస్టు 15న) సందర్భంగా ల్యాండ్‌లైన్‌ నుంచి ఏ నెట్‌వర్క్‌ ల్యాండ్‌లైన్‌ లేదా మొబైల్‌ ఫోన్‌కు అపరిమితంగా మాట్లాడుకునే వీలు కల్పిస్తున్నట్లు తెలిపింది. ప్రైవేటు సంస్థల నుంచి పోటీని తట్టుకునేందుకు ఇప్పటికే రాత్రి 9 నుంచి 7 గంటల వరకు ల్యాండ్‌లైన్‌ నుంచి ఏ నెట్‌వర్క్‌ ల్యాండ్‌లైన్‌ లేదా మొబైల్‌కు అపరిమితంగా మాట్లాడుకునే సౌకర్యాన్ని బీఎస్‌ఎన్‌ఎల్‌ అందిస్తోంది.

No comments:

Post a Comment