అరిజోనా: అమెరికాలోని
అరిజోనాలో కూతురు చేసిన పనితో తల్లికి విపరీతమైన కోపమొచ్చింది. జీనత్
వుడ్స్ అనే మహిళ పనిమీద బయటకు వెళ్లింది. ఇంటికొచ్చి చూసేసరికి తన 16 ఏళ్ల
కూతురు, బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి బెడ్‌పై రాసలీలలు చేస్తూ కనిపించింది. దీంతో
జీనత్ నోట మాట రాలేదు. వెంటనే ఆమె ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అతనిపై
పిడిగుద్దుల వర్షం కురిపించింది. ఇంతకు తెగిస్తావా అంటూ ముఖం
పగులగొట్టింది. కారులో పరారవడానికి అతను ప్రయత్నించాడు. అతని కారును
బాస్కెట్ బాల్‌తో కొట్టి దాడి చేసింది. కారు కీస్ లాక్కొని ఇవ్వకుండా
అతనిని తరిమికొట్టింది. దీంతో అతను పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు ఆమెను
అరెస్ట్ చేసి, 5వేల డాలర్ల ఫైన్ విధించారు.

No comments:
Post a Comment