Saturday, 13 August 2016

మోటారు సైకిళ్లకూ టచ్ స్క్రీన్‌లు

వాషింగ్‌టన్ : టచ్‌స్ర్కీన్‌లు స్మార్ట్ ఫోన్లకే కాదు మోటారు సైకిళ్లకు కూడా అందుబాటులోకి రానున్నాయి. ప్రముఖ అమెరికా మోటారుసైకిలు కంపెనీ తయారు చేస్తున్న మోటారు సైకిళ్లకు కొత్తగా ‘రైడ్ కమాండ్’ పేరిట ఏడు అంగుళాల టచ్‌స్ర్కీన్‌లను ఏర్పాటు చేసింది. 
 మనం ప్రయాణిస్తున్న దారిలో వచ్చే మూలమలుపుల సమాచారం ఈ స్ర్కీన్‌లపై కనిపించనుంది. మోటారుసైకిలు ట్యాంకులో ఇంధనం తక్కువగా ఉన్నపుడు సమీపంలో పెట్రోలుబంకు ఎక్కడ ఉందనే సమాచారం కూడా ఈ స్ర్కీన్‌ పై దర్శనమిస్తుంది. మోటారుసైకిల్ రైడ్ కమాండ్ టచ్‌స్ర్కీన్‌ ను స్మార్ట్ ఫోన్ కు కూడా సింక్రనైజ్ చేసుకోవచ్చు. 2013వ సంవత్సరంలో బీఎండబ్ల్యూ బైక్ లకు నావిగేటర్ డివైజ్ ను రూపొందించింది. 2014లో హార్లీ డేవిడ్ సన్ బైక్ లకు బాక్సు సిస్టంను ప్రవేశపెట్టింది. రైడ్ కమాండ్ బైక్ లలో నావిగేటర్ తో పాటు టచ్‌స్ర్కీన్‌ ఫీచర్ ను ప్రవేశపెట్టింది. మన దేశంలో ఈ టచ్‌స్ర్కీన్‌లు చీఫ్ టెయిన్, రోడ్ మాస్టర్ బైక్ లలో అందుబాటులోకి రానున్నాయి.

No comments:

Post a Comment