మద్యం సేవించి వాహనం నడిపితే రూ.10వేలు, వాహనంతో ఢీకొట్టి
పారిపోతే రూ.2 లక్షల జరిమానా విధించే మోటారు వాహన (సవరణ) బిల్లు-2016కు
కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రోడ్డు ప్రమాదంలో మరణం సంభవిస్తే
రూ.10 లక్షల పరిహారాన్ని అందించే నిబంధనను కూడా ఈ బిల్లులో చేర్చారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం
పలు కీలక నిర్ణయాలు తీసుకొంది. రోడ్లను సురక్షితంగా మార్చేందుకు, లక్షల
మంది ప్రాణాలను కాపాడేందుకు ఈ బిల్లు ఓ చరిత్రాత్మక అడగు అని రోడ్డు రవాణా,
జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. మంత్రివర్గ సమావేశం
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 18 రాష్ర్టాల రవాణా మంత్రుల సిఫారసుల
ఆధారంగా ఈ ప్రతిపాదనలు రూపొందించామని చెప్పారు.
అతి వేగానికి రూ.1000 నుంచి రూ.4 వేల వరకు జరిమానా విధించే అంశం ఈ బిల్లులో ఉందని తెలిపారు. ప్రస్తుత మోటారు వాహన చట్టంలో 223 సెక్షన్లు ఉన్నాయని, వాటిలో 68 సెక్షన్లను ఈ బిల్లు సవరించనుందని, కొత్తగా 28 సెక్షన్లను చేర్చనుందని చెప్పారు. రోడ్డు భద్రత, గ్రామీణ రవాణా వ్యవస్థ బలోపేతం, చివరి గ్రామం వరకూ రవాణా సదుపాయం, యాంత్రీకరణ, కంప్యూటరీకరణ, ఆన్‌లైన్ సేవలను ఈ బిల్లు ప్రతిపాదిస్తున్నదని గడ్కరీ చెప్పారు. రోడ్డు ప్రమాదాలు, మరణాలను 50 శాతానికి తగ్గించడమే తమ లక్ష్యమని తెలిపారు. దేశంలో ఏటా 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా, 1.5 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. ఈ బిల్లును వచ్చేవారం పార్లమెంట్‌లో ప్రవేశపెడుతామని, అన్ని పార్టీలు మద్దతునివ్వాలని గడ్కరీ విజ్ఞప్తి చేశారు.
-నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా
-మోటారు వాహన చట్టం సవరణ బిల్లుకు ఆమోదం
-వచ్చేవారం పార్లమెంట్ ముందుకు
-కేంద్ర పథకాలు ఇక 30 దాటవు
-కేంద్రమంత్రివర్గం కీలక నిర్ణయాలు
అతి వేగానికి రూ.1000 నుంచి రూ.4 వేల వరకు జరిమానా విధించే అంశం ఈ బిల్లులో ఉందని తెలిపారు. ప్రస్తుత మోటారు వాహన చట్టంలో 223 సెక్షన్లు ఉన్నాయని, వాటిలో 68 సెక్షన్లను ఈ బిల్లు సవరించనుందని, కొత్తగా 28 సెక్షన్లను చేర్చనుందని చెప్పారు. రోడ్డు భద్రత, గ్రామీణ రవాణా వ్యవస్థ బలోపేతం, చివరి గ్రామం వరకూ రవాణా సదుపాయం, యాంత్రీకరణ, కంప్యూటరీకరణ, ఆన్‌లైన్ సేవలను ఈ బిల్లు ప్రతిపాదిస్తున్నదని గడ్కరీ చెప్పారు. రోడ్డు ప్రమాదాలు, మరణాలను 50 శాతానికి తగ్గించడమే తమ లక్ష్యమని తెలిపారు. దేశంలో ఏటా 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా, 1.5 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. ఈ బిల్లును వచ్చేవారం పార్లమెంట్‌లో ప్రవేశపెడుతామని, అన్ని పార్టీలు మద్దతునివ్వాలని గడ్కరీ విజ్ఞప్తి చేశారు.

No comments:
Post a Comment