Wednesday, 3 August 2016

జీఎస్‌టీ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) సవరణ బిల్లుకు రాజ్యసభ బుధవారం ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై రాజ్యసభలో సుదీర్ఘ చర్చ అనంతరం ఓటింగ్‌ నిర్వహించగా యావత్‌ సభ మద్దతు తెలిపింది. జీఎస్‌టీ బిల్లుకు ఆమోదం తెలిపిన సందర్భంలో సభలో 197 మంది సభ్యులు ఉన్నారు. కేంద్ర ఆర్థిక శాఖామంత్రి అరుణ్‌ జైట్లీ పెట్టిన సవరణలకు సభ ఆమోదం తెలిపింది. చివరగా ఈ బిల్లుకు పలు సవరణలపై ఓటింగ్‌ నిర్వహించారు. బిల్లుకు ఆమోదం తెలిపిన అనంతరం సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ ఛైర్మన్‌ కురియన్‌ ప్రకటించారు.
జీఎస్‌టీ బిల్లుతో తమలాంటి రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని వాదించిన అన్నా డీఎంకే సభ్యులు ఓటింగ్‌కు ముందే సభ నుంచి వాకౌట్‌ చేశారు.
మూడు కీలక సవరణలతో ఆమోదం పొందిన ఈ చరిత్రాత్మక జీఎస్టీ చట్టరూపం దాల్చితే దేశమంతా ఒకటే పన్ను వర్తించనుంది.

No comments:

Post a Comment