Sunday, 7 August 2016

‘జనతా’ హీరో... నువ్వా.. నేనా?

టెంపర్, నాన్నకు ప్రేమతో సినిమాలతో హిట్‌లు సాధించి హ్యాట్రిక్‌పై కన్నేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. మిర్చి, శ్రీమంతుడు సినిమాలతో మాంచి ఊపుమీదున్న కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ సంచనాలు సృష్టించడంతో సినిమా కూడా ఒక విందులా ఉంటుందని దర్శకుడు కొరటాల చెప్తున్నాడు. ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ప్రధాన పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమా మలయాళ వెర్షన్‌ క్లైమాక్స్‌ను హీరో ఎన్టీఆర్‌ పాత్రను కాకుండా మోహన్‌లాల్ పాత్రను ప్రధానంగా తీసుకొని సినిమాను ముగించనున్నట్లు ఫిలింనగర్‌లో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. అయితే, తెలుగు వెర్షన్‌లో మాత్రం ఎన్టీఆర్ ప్రధానంగా క్లైమాక్స్‌ను రూపొందించినట్లు చెప్పుకుంటున్నారు. ఈ సినిమాతో కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో బేస్ వేసుకోవాలని ప్రయత్నిస్తున్న ఎన్టీఆర్ మాత్రం దీనిపై సుముఖంగా లేనట్లు, ఇలా రెండు క్లైమాక్స్‌లు ఉంటే సినిమా ఎలా ఉంటుందోనని నందమూరి అభిమానులు సైతం ఆందోళనలో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే, కేరళలో మెహన్‌లాల్ సూపర్ స్టార్ కావడంతో ఆయన పాత్రకు ఒక కేరక్టర్‌కు పరిమితం చేస్తే ఫ్యాన్స్ హర్ట్ అవుతారని, ఇది సినిమాపై ప్రభావం చూపుతుందని క్లైమాక్స్‌ను ఇలా ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఇటీవల టాలీవుడ్ హీరో వెంకటేశ్ సినిమా ‘బాబు బంగారం’ తమిళ వెర్షన్‌ టైటిల్‌ను నయనతారను దృష్టిలో ఉంచుకొని ‘సెల్వి’గా మార్చారు. కానీ, ఏకంగా జనతా సినిమా క్లైమాక్సే మార్చేయడం చూస్తే అసలు ఈ సినిమాలో హీరో ఎవరు అన్న ప్రశ్నకు రాక మానదు.

No comments:

Post a Comment