చిరంజీవి నటిస్తున్న
ప్రతిష్టాత్మక 150వ సినిమా గురించి రోజుకో వార్త వెలువడుతోంది. ఈ సినిమాలో
ఫుల్ లెంగ్త్ కమెడియన్ రోల్‌లో సునీల్ అని ఒకసారి, అలీ అని ఒకసారి
చెబుతున్నారు. అయితే ఈ సినిమాలో సునీల్ నటిస్తున్నాడో లేదో తెలియదు కానీ, ఈ
సినిమాలో వేసే వీణ స్టెప్‌లో మాత్రం చిరంజీవితో కాలు కదపనున్నాడట సునీల్.
అలాగే విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆ వీణ స్టెప్‌ను చిరు, సునీల్‌తోపాటు
మెగా హీరోలందరూ వేయనున్నారట. మొత్తమందరూ కాకపోయినా చరణ్, బన్నీ, సాయిధరమ్
మాత్రం కచ్చితంగా వేస్తారట. ఇప్పటికే ఈ వీణస్టెప్‌ను సునీల్, పవన్
కల్యాణ్ తమ తమ సినిమాల్లో వాడేసిన సంగతి తెలిసిందే.

No comments:
Post a Comment