Wednesday, 20 July 2016

అప్పుడు ‘బాహుబలి’ ఇప్పుడు ‘కబాలి’

పారిస్‌: కబాలి.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే ట్రెండ్‌. విడుదలకు మరో రెండు రోజులు మాత్రమే ఉండటంతో దేశవ్యాప్తంగా రజనీకాంత్‌ అభిమానులు సందడి షురూ చేశారు. ఇప్పటికే రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్న కబాలి మరో అరుదైన విశేషాన్ని సొంతం చేసుకుంది. యూరప్‌లోని ప్రఖ్యాత ‘ది గ్రాండ్‌ రెక్స్‌’ థియేటర్‌లో చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ఇది యూరప్‌లోనే అతి పెద్ద థియేటర్‌ కావడం విశేషం. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ చిత్రాన్ని ఈ ఏడాది జూన్‌లో రెక్స్‌ థియేటర్‌లో ప్రదర్శించారు. ఇప్పుడు ‘కబాలి’ రెక్స్‌లో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాడు. పా రంజిత్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాధిక ఆప్టే కథానాయికగా నటిస్తోంది.

No comments:

Post a Comment