క్షణికావేశంలో తప్పుచేసే యువత ఇది చూసైనా మారతారా ?
ఉత్తరప్రదేశ్:
ఏ తల్లి కన్నబిడ్డో తెలియదు. అడ్డుగా ఉందని తొలగించుకుందో, క్షణికావేశంలో
చేసిన తప్పుకు బిడ్డను బలిచేసిందో తెలియదు. ఆగి ఉన్న రైలు బోగీలోని
టాయ్‌లెట్ రూమ్ ఆ పసికందుకు జన్మస్థానమైంది. దుర్వాసన భరించలేక ఆ పసిప్రాణం
విలవిలలాడింది. వెక్కివెక్కి ఏడ్చింది. గుక్కపట్టి కన్నీళ్లు కార్చిన ఆ
పసికందు ఊపిరి కొద్దిసేపటికి గాల్లో కలిసిపోయింది. రైలు బోగీల్లో
టాయ్‌లెట్ క్లీన్ చేయడానికి వచ్చిన అటెండెంట్ లోపల పాప కనిపించడం చూసి
చలించిపోయాడు. వెంటనే స్టేషన్ మాస్టర్‌కు ఈ విషయాన్ని తెలియజేశాడు.
స్టేషన్ మాస్టర్ వచ్చి చూసే సమయానికే ఆ పాపకు ఈ ప్రపంచం తుది వీడ్కోలు
పలికింది. ఈ మురికి సమాజంలో తాను బతకలేనంటూ ఆ పసిప్రాణం దేవుడి దగ్గరకు
వెళ్లిపోయింది. ఉత్తరప్రదేశ్‌లోని బరేలిలో ఈ ఘటన జరిగింది. ఉన- హిమాచల్
ఎక్స్‌ప్రెస్‌ను స్టేషన్‌లో పక్కన నిలిపివేశారు. బాత్రూమ్ క్లీన్ చేయడానికి
తేజ్ ప్రతాప్ సింగ్ అనే అటెండెంట్ బోగీలోకి వెళ్లాడు. డోర్ తెరిచి చూడగానే
పేగు రక్తం కూడా తడారని పసికందును చూసి షాకయ్యాడు. ఉలుకుపలుకు లేకుండా పడి
ఉన్న ఆ బిడ్డను గురించి స్టేషన్ మాస్టర్‌కు చెప్పాడు. స్టేషన్ మాస్టార్
వచ్చి బిడ్డకు ఊపిరి ఉందా లేదా చూశాడు. అప్పటికే ప్రాణాలు కోల్పోయిందని
తెలిసి తల్లడిల్లాడు. పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

No comments:
Post a Comment