యూకే: విద్యార్థితో
శృంగార కార్యకలాపాలు సాగించిన 24 ఏళ్ల టీచర్ ఒకరు ఇప్పుడు కోర్టులో
ముద్దాయిగా నిలబడింది. మైనర్‌పై అత్యాచారానికి పాల్పడినట్టు ఆమెపై కేసు
నమోదు చేసిన పోలీసులు టీచర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మేరీ బెత్
హగ్లీన్(24) తాను టీచర్‌గా పనిచేస్తున్న స్కూల్లోని ఓ విద్యార్థితో
అక్రమంగా సంబంధం ఏర్పరుచుకుంది. విషయం ఎలాగోలా బయటపడడంతో పోలీసుల వరకు
వెళ్లింది. వారు ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. అయితే ఈ
విషయంలో తాను పనిచేస్తున్న స్కూలు యాజమాన్యం కావాలనే ఇబ్బందులు పెడుతోందని,
తనకు, విద్యార్థికి మధ్య సంబంధం ఉన్న విషయం యాజమాన్యానికి తెలుసని ఆమె
కోర్టుకు తెలిపింది. తాను దీని నుంచి తప్పించుకోవాలని చూడడం లేదని, ఈ పనికి
తాను సిగ్గుపడడం లేదని పేర్కొంది. దీనిని తాను ఎదుర్కొంటాను తప్ప పారిపోయే
ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది.
మునుపటి
సంబంధాలు తనను ఇందుకు ప్రేరేపించాయని, ఇందుకు స్కూలు వాతావరణం కూడా
సహకరించిందని పేర్కొంది. అయితే విద్యార్థి, టీచర్ విషయం తెలిసిన స్కూలు
యాజమాన్యం ఆమెపై దర్యాప్తు ప్రారంభిస్తూ కెడార్ ర్యాపిడ్ స్కూల్స్‌కు
సబ్‌స్టిట్యూట్‌గా పంపించింది. తనను వాషింగ్టన్ హైస్కూల్ నుంచి రిలీజ్
చేసినా మరో ప్రాంతంలోని స్కూలుకు పంపించినట్టు మేరీ పేర్కొంది. స్కూలు
యాజమాన్యానికి తమ ‘రిలేషన్’ గురించి ఫిబ్రవరిలోనే తెలిసినా స్కూలుకున్న
మంచి పేరును రక్షించుకునేందుకు నోరెత్తలేదని, ఇప్పుడు విషయం బయటపడడంతో తనను
ఇరికించాలని చూస్తోందని కోర్టులో ఆవేదన వ్యక్తం చేసింది. మేరీ కనుక దోషిగా
తేలితో రెండేళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.

No comments:
Post a Comment