విశాఖ: వాయువ్య
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణశాఖ వెల్లడించింది.
ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ, దక్షిణ కోస్తామీదుగా ద్రోణి ఏర్పడిందని
తెలిపింది. వీటి ప్రభావంతో ఉత్తర కోస్తాలో పలుచోట్ల వర్షాలు పడతాయని
వాతావరణశాఖ పేర్కొనింది. ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని
తెలిపింది. రాయలసీమ, ఉత్తర తెలంగాణలో అక్కడక్కడ, ఒడిశాలో భారీ వర్షాలు
కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ చెప్పింది.
No comments:
Post a Comment