Friday, 22 July 2016

ఒక్క రోజులోనే పాన్‌, టాన్‌...

న్యూదిల్లీ: వ్యాపార, వాణిజ్య సంస్థలు అత్యంత అవసరమైన పాన్‌, టాన్‌ సంఖ్యలను ఇక ఒక్కరోజులోనే పొందవచ్చు. వ్యాపారాన్ని సులభతరం (ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌) చేయడంలో భాగంగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు ఆదాయ పన్ను శాఖ తెలిపింది. సంస్థలు డిజిటల్‌ సిగ్నేచర్‌ సర్టిఫికెట్‌ అప్లికేషన్‌ సమర్పిస్తే ఒక్క రోజులోనే పాన్‌, టాన్‌ నమోదు ప్రక్రియ పూర్తవుతుందని పేర్కొంది. ఆధార్‌ ఆధారిత ఈ సిగ్నేచర్‌ వ్యవస్థ సౌలభ్యంతో వ్యక్తులు పాన్‌ సంఖ్యను త్వరగా పొందొచ్చని తెలిపింది.
పాన్‌, టాన్‌ సేవలందించే NSDL eGov, UTIITSL శాఖల్లో డిజిటల్‌ సిగ్నేచర్‌ సేవల విధానాన్ని ప్రవేశ పెట్టినట్లు ఆదాయ పన్ను శాఖ వివరించింది. ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ పూర్తైన ఒక్క రోజు తర్వాత పాన్‌, టాన్‌ సంఖ్యలు కేటాయిస్తామని పేర్కొంది. ఆధార్‌ అనుసంధానంతో నకిలీ, రెండు పాన్‌ సంఖ్యలు రావడం వంటి సమస్యలు తగ్గుతాయని పేర్కొంది.

No comments:

Post a Comment